రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్లు సమన్లు- కరోనిల్ ప్రమోషన్‌కు బ్రేక్- డాక్టర్లకూ చురకలు
యోగా గురు రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. కరోనాను తమ పతంజలి కరోనిల్ కిట్ తగ్గిస్తుందంటూ రాందేవ్ చేస్తున్న ప్రచారంపై ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు... రాందేవ్‌కు నోటీసులు పంపింది. విచారణ పూర్తయ్యే వరకూ కరోనిల్ మందుపై మాట్లాడొద్దని ఆంక్షలు విధించింది.
పతంజలి కరోనిల్ కిట్‌తో కరోనా తగ్గుతుందంటూ ప్రజల్ని రాందేవ్ బాబా తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు... ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. రాందేవ్‌కు సమన్లు జారీ చేస్తూనే అటు డాక్టర్లకూ అక్షింతలు వేసింది. కరోనాను ఎలా తగ్గించాలో చూడకుండా రాందేవ్ గురించి ఆలోచించడంపై మండిపడింది. అయితే రాందేవ్‌ను కూడా కరోనిల్ కిట్‌ను ప్రోత్సహిస్తూ డాక్టర్లను రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది.

అల్లోపతి వైద్యంపై రాందేవ్ వ్యాఖ్యల్ని భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగానే చూడాలని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. హోమియోపతి వైద్యం ఫేక్ అని నేనంటే నాకు వ్యతిరేకంగా హోమియోపతి వైద్యులు పిటిషన్ వేస్తారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
మీ వీలువైన సమయం వృధా చేస్తూ రాందేవ్ కరోనా కిట్ గురించి ఆలోచించకుండా కరోనా వైరస్‌ను ఎలా తగ్గించాలో ఆలోచించాలని న్యాయమూర్తి ఢిల్లీ మెడికల్ అసోసియేషన్‌కు సూచించారు. ఇప్పటికే అల్లోపతిపై రాందేవ్ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 1000 కోట్ల దావా వేసింది.












Click it and Unblock the Notifications