వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దు, అసలు విషయం చెప్పిన మోడీ!: మన్ కీ బాత్‌లో ఏమన్నారంటే..

ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు 26వ మన్ కీ బాత్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ విషయాన్ని బయటపెట్టారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు 26వ మన్ కీ బాత్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ విషయాన్ని బయటపెట్టారు. నోట్ల రద్దుతో నల్లధనం కలిగి ఉన్న వారిని టార్గెట్ చేయడంతో పాటు క్యాష్ లెస్ వైపు దేశాన్ని నడిపించాలనే అభిప్రాయం మోడీ మాటల ద్వారా వెల్లడయింది.

ఆ తర్వాతే మోడీకి ఎదురు తిరిగారు!: ఒక్కటైన పవన్ కళ్యాణ్, చంద్రబాబుఆ తర్వాతే మోడీకి ఎదురు తిరిగారు!: ఒక్కటైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు

ఆయన ఆదివారం మన్ కీ బాత్‌లో మాట్లాడారు. కెన్యాలో ఎం-పెసా విధానాన్ని ప్రవేశ పెట్టిన అంశాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. వొడాఫోన్ 2007లో కెన్యాలో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది. మొబైల్ ఫోన్ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపడమే దీని ఉద్దేశ్యం. దీనినే మన పరిభాషలో క్యాష్ లెస్ విధానం అంటాం. క్యాష్ లెస్ విధానం అమలయితే నల్ల ధనాన్ని నియంత్రించగలమని ప్రధాని మోడీ విశ్వసిస్తున్నారు.

 Demonetisation will make Economy stronger: PM Modi

మన్ కీ బాత్‌లో మోడీ ఏమన్నారంటే..

డెబ్బై ఏళ్లుగా ఏళ్లుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న నల్లధనం అనే వ్యాధికి చికిత్స చేసేందుకు కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు అందరూ ఓపిక పట్టాలన్నారు. నల్లధనంపై తీసుకున్న నిర్ణయం పెద్ద అడుగు, దీని వల్ల మొదటి 50 రోజులు కొంత ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని తాను ముందే చెప్పానన్నారు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజలందరూ అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకులు, తపాలా కార్యాలయ ఉద్యోగులు ఎంతో శ్రమించారని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తమ విధులు ఎంతో శ్రద్ధగా నిర్వర్తించారన్నారు.

ఈ ఏడాది దీపావళి ఎంతో విభిన్నంగా ఉందని, ప్రతి ఒక్కరూ తమ సందేశాలను దేశజవాన్లకు పంపించడం అద్భుతం అన్నారు. సరిహద్దులో ఈ ఏడాది ఒంటరిగా దీపావళి చేసుకున్నామన్న భావన మాకు కలగలేదని ఒక జవాను లేఖ రాశారని చెప్పారు.

నోట్ల రద్దుపై మోడీకి 'సర్వే' షాక్!: చంద్రబాబు అసహనం, పవన్ కళ్యాణ్ ఆగ్రహంనోట్ల రద్దుపై మోడీకి 'సర్వే' షాక్!: చంద్రబాబు అసహనం, పవన్ కళ్యాణ్ ఆగ్రహం

నగదు కొరత వల్ల కొన్ని రెస్టారెంట్లు ఉచితంగా ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు తెలిసిందని, వారికి నా అభినందనలు అన్నారు. నోట్ల రద్దు వల్ల సూరత్‌కు చెందిన ఓ జంట కేవలం రూ.500తో వివాహం చేసుకోవడాన్ని మోడీ అభినందించారు. వివాహ వేడుక సందర్భంగా తేనీరు పంచడంపై ప్రశంసించారు.

ప్రతి ఒక్కరూ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, నగదు రహిత లావాదేవీలు చేసేందుకు అనేక సురక్షిత మార్గాలు ఉన్నాయని, దీనిని చిన్న తరహా వ్యాపారులు ఉపయోగించుకోవాలన్నారు. రోజువారీ కూలీలందరూ బ్యాంకు ఖాతాలను తెరవాలన్నారు.

నగదు రహిత సమాజంగా మారడమే తన కల అన్నారు. దేశంలోని పేద, రైతులు, కార్మికులకు బాధలు దూరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. నల్లధనాన్ని దాచుకునేందుకు పేద ప్రజల బ్యాంకు ఖాతాలను దయచేసి ఎవరూ ఉపయోగించవద్దన్నారు.

మోడీని కార్నర్ చేసేందుకు..: బంద్‌పై లెక్కలు, కాంగ్రెస్ సీఎం ట్విస్ట్మోడీని కార్నర్ చేసేందుకు..: బంద్‌పై లెక్కలు, కాంగ్రెస్ సీఎం ట్విస్ట్

ఫోన్లు ఉపయోగించండి: మోడీ

ఈ-బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌లను వినియోగించుకోవాల్సిన సమయం వచ్చేసిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు కలుగుతుండటంతో ఇక నుంచి ప్రజలు డిజిటల్‌ బ్యాంకింగ్‌ మార్గాలను వినియోగించుకోవడం మొదలుపెట్టాలని ట్వీట్ చేశారు.

English summary
The decision on demonetisation was a tough one, but it was aimed at making the Indian economy stronger said Prime Minister Narendra Modi while addressing in his 26th edition of Mann Ki Baat on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X