వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి లైంగిక దాడి కేసు: హీరో దిలీప్ ను కోర్టుకు తీసుకురాలేం: చేతులు ఎత్తేసిన పోలీసులు !

ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ ను కోర్టు ముందు హాజరుపరచలేమని కేరళ పోలీసులు న్యాయమూర్తికి మనవి చేశారు.

|
Google Oneindia TeluguNews

కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ ను కోర్టు ముందు హాజరుపరచలేమని కేరళ పోలీసులు న్యాయమూర్తికి మనవి చేశారు. దిలీప్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చెయ్యాలని కేరళ పోలీసులు కోర్టులో చెప్పారు.

నటి నగ్న ఫోటోలు, వీడియో ఇవ్వు: రూ. కోట్లు ఇస్తా, మలయాళం హీరో దిలీప్ బంపర్ ఆఫర్ !నటి నగ్న ఫోటోలు, వీడియో ఇవ్వు: రూ. కోట్లు ఇస్తా, మలయాళం హీరో దిలీప్ బంపర్ ఆఫర్ !

ప్రముఖ నటి లైంగిక దాడి కేసులో దిలీప్ ను అరెస్టు చేసిన తరువాత ఆయన అంగమాలి సబ్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హీరో దిలీప్ సొంత ఊరు అయిన ఆలువా ఊరికి సమీపంలోనే అంగమాలి సబ్ జైలు ఉంది. జులై 10వ తేదీన హీరో దిలీప్ ను పోలీసులు అరెస్టు చేశారు.

రిమాండ్ ఖైదీగా హీరో దిలీప్

రిమాండ్ ఖైదీగా హీరో దిలీప్

జులై 11వ తేదిన దిలీప్ ను 14 రోజులు రిమాండ్ కు తరలించాలని అంగమాలి మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తరువాత మూడు రోజుల పాటు దిలీప్ ను కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆయన్ను కొచ్చి, త్రిశూర్, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లో విచారణ చేశారు.

Recommended Video

Man held for raping and impregnating Madhapur teenage girl
సెక్యూరిటీ సమస్యతో !

సెక్యూరిటీ సమస్యతో !

హీరో దిలీప్ ను మంగళవారం (జులై 25వ తేది) కోర్టు ముందు హాజరుపరచాలి. అయితే దిలీప్ సొంత ఊరు అంగమాలి సబ్ జైల్ సమీపంలోనే ఉండటంతో భారీ ఎత్తున స్థానిక ప్రజలు సబ్ జైలు దగ్గర గుమికూడుతున్నారు. ఇలాంటి సమయంలో దిలీప్ ను బయటకు తీసుకువస్తే శాంతిభద్రతల సమస్యలు ఎదురౌతాయని పోలీసులు అంటున్నారు.

అభిమానులే ఆగ్రహంతో !

అభిమానులే ఆగ్రహంతో !

ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో దిలీప్ అరెస్టు కావడంతో ఆయన అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా దిలీప్ సొంత ఊరు అయిన ఆలువ ప్రాంతంలోని ప్రజలు జైలు దగ్గరకు చేరుకుని దిలీప్ కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.

దిలీప్ మీద దాడి చేసే అవకాశం ?

దిలీప్ మీద దాడి చేసే అవకాశం ?

జైలు దగ్గర ఇలాంటి సమస్యలు ఉన్న సందర్బంలో దిలీప్ ను బయటకు తీసుకువస్తే ఆయన మీద దాడి జరిగే అవకాశం ఉందని కేరళ ఇంటిలిజెన్స్ పోలీసులు పసిగట్టారు. అందుకే దిలీప్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వార విచారణ చెయ్యాలని కేరళ పోలీసులు అంగమాలి మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.

చిందులు వేసిన హీరో నేడు మౌనంగా ?

చిందులు వేసిన హీరో నేడు మౌనంగా ?

దిలీప్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణ చెయ్యాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైతం కోర్టులో చెప్పారు. దిలీప్ బెయిల్ పిటిషన్ ను సోమవారం కేరళ హైకోర్టు తొసిపుచ్చిన విషయం తెలిసింది. తనకు బెయిల్ రాలేదని హీరో దిలీప్ జైల్లో మౌనంగా ఉన్నాడని తెలిసింది.

English summary
Dileep presented in court by video conferencing. Dileep's 14-day judicial custody would end on Tuesday. He would be produced before the magistrate. The prosecution argued that Dileep being a high profile celebrity with lot of influence could play spoilsport if given bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X