జయలలిత మృతిపై విచారణ, హాజరైన ప్రభుత్వ వైద్యుడు, వేలిముద్రలు ఎవరివి !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ హాజరైనారు.

అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమంలో తమిళనాడులోని రెండు శాసన సభ నియోజక వర్గాలకు, పుదుచ్చేరిలోని ఓ శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సందర్బంలో బీఫాంలో జయలలిత వేలిముద్రలు వేయించి ఎన్నికల కమిషన్ కు సమర్పించారు.

Dr Balaji appeared before justice Arumugasamy commission

బీఫాంలో జయలలిత సంతకాలు చెయ్యలేకపోయారని, స్వయంగా తన కళ్ల ముందే ఆమె వేలిముద్రలు వేశారని తమిళనాడు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ భారత ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారు. జయలలిత వేలిముద్రల విషయంలో ఇప్పటికే జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు రెండు సార్లు హాజరైన డాక్టర్ బాలాజీ బుధవారం మూడో సారి విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dr. Balaji who confirmed the Jayalalitha thub impression got in front of her appeared before justice Arumugasamy commission for the third time.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి