వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటు న‌మోదు అవ‌గాహ‌న కోసం.. ఫేస్‌బుక్‌తో చేతులు కలిపిన ఎలక్షన్ కమిషన్

ఓటు హ‌క్కు న‌మోదు గురించి యువతలో అవ‌గాహ‌న పెంపొందించ‌డం కోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘం, సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఓటు హ‌క్కు న‌మోదు గురించి యువతలో అవ‌గాహ‌న పెంపొందించ‌డం కోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘం, సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

దీంతో యువ‌త ఎక్కువ స‌మ‌యం గడిపే ఫేస్‌బుక్ ద్వారా ఓటు హ‌క్కు న‌మోదు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసే అవ‌కాశం క‌ల‌గ‌నుంది. ఒప్పందంలో భాగంగా 18 ఏళ్లు నిండిన యువ‌త‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌తో పాటు ఓటు న‌మోదు చేసుకోవాల‌నే మెసేజ్ వెళ్తుంది.

Election Commission and Facebook join hands for voter registration

ఆ మెసేజ్ మీద క్లిక్ చేయ‌గానే ఓట‌ర్స్ స‌ర్వీసెస్ పోర్ట‌ల్‌కు అనుసంధానం అవుతుంది. అక్క‌డ వివ‌రాలు న‌మోదు చేస్తే ఒక్క క్లిక్‌తో ఓటు హ‌క్కు న‌మోదు ప్ర‌క్రియ పూర్త‌వుతుంది.

ఎన్నికల సంఘం ఈ మెసేజ్‌ను తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మొత్తం 13 భాషల్లో అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ ఏడాది ఇప్పటికే 18 ఏళ్లు పూర్తి చేసుకున్న, పైబడిన వారందరికి ఈనెల 30న ఫేస్‌బుక్ ద్వారా ఈ సందేశం వెళ్లనుంది.

English summary
The Election Commission and Facebook on Monday announced a pact under which the social media giant will remind the youth who recently turned 18 to register to vote by sending them reminders on their Facebook profile. Under the campaign, all users who are going to turn 18 between now and December 31 will get a "birthday wish" message on their birthday with a reminder encouraging them to register with the poll panel to vote. To those who have already turned 18 this year, same reminder will be sent on November 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X