వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నమ్మకు షాక్: దినకరన్ వివరణను ఒప్పుకోమని చెప్పిన ఈసీ, 'పన్నీర్' దే పైచేయి

అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.శశికళపై పన్నీర్ వర్గం ఫిర్యాదు చేయడంతో టీటీవి దినకరన్ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి హోదాలో ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికను అంగీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.ఆమె నియామకం గురించి వివరణ ఇచ్చే అధికారం ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవి దినకరన్ కు లేదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన షాక్ తో శశికళ వర్గానికి దిమ్మతిరిగింది.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ చేపట్టారు. పార్టీ సీనియర్లు పార్టీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.

అయితే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికైంది. పార్టీ పై పట్టు సాధించింది.అయితే అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్ళే రొజు తెల్లవారుజామునే ఆమె పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవి దినకరన్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకొంది.

పార్టీని తన గుప్పిట్లోకి తీసుకొన్నందుకు శశికళ తీసుకొన్న నిర్ణయాలను ప్రశ్నించేవారు లేకుండా పోయారు.అయితే శశికళ వర్గంపై పన్నీర్ సెల్వం వర్గం పైచేయి సాధించే ప్రయత్నాలను ప్రారంభించింది.ఈ మేరకు శశికళ వర్గంపై ఎన్నికల సంఘానికి పన్నీర్ వర్గం ఫిర్యాదు చేసింది.

చిన్నమ్మకు షాకిచ్చిన ఎన్నికల సంఘం

చిన్నమ్మకు షాకిచ్చిన ఎన్నికల సంఘం

అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకంలో కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది.

ఆమె నియామకం గురించి ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవి దినకరన్ కు లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల తేదిలోపుగా శశికళ సంతకంతో వివరణ తమకు సమర్పించాలని శుక్రవారం నాడు ఎన్నికల సంఘం ఆదేశించింది.

పన్నీర్ వర్గం ఫిర్యాదుతో శశికళకు ఇబ్బందులు

పన్నీర్ వర్గం ఫిర్యాదుతో శశికళకు ఇబ్బందులు

ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణం చేసేందుకు రంగం సిద్దం చేసుకొనే సమయంలో జయ అక్రమాస్తుల కేసు అడ్డువచ్చింది.దీంతో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకుగానను ముహుర్తం కూడ నిర్ణయించుకొన్నా పరిస్థితులు అందుకు సహకరించలేదు.


ముఖ్యమంత్రి పదవి కోసం పన్నీర్ సెల్వం,శశికళ గ్రూపులు ప్రయత్నాలు చేశాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే నెపంతో పన్నీర్ సెల్వంతో పాటు ఆయనకు సహకరించినవారిని పార్టీ నుండి తప్పిస్తూ శశికళ వర్గం నిర్ణయం తీసుకొంది.అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శశికళ వర్గంపై ఫిర్యాదు చేశారు పన్నీర్ వర్గం నాయకులు.

శశికళ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి నియామకాలు చెల్లవు

శశికళ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి నియామకాలు చెల్లవు

అన్నాడిఎంకె తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నియామకం చెల్లదని ఎలాంటి అధికారాలు లేకుండా ఆమె నియమకాలు తొలగింపులు సాగించారని ఆ ఫిర్యాదులో పన్నీర్ సెల్వం శిబిరం పేర్కొంది.


దీనిపై శశికళను కేంద్ర ఎన్నికల కమీషన్ వివరణ కోరింది. ఆమె తరపున అన్నాడిఎంకె ఉప ప్రధాన కార్యరద్శి టీటీవి దినకరన్ గత నెల 28వ, తేదిన ఎన్నికల కమీషన్ కు వివరణ ఇచ్చారు. అన్నాడిఎంకె నియమ నిబంధనల మేరకు శశికళ నియామకం జరిగినట్టు వివరించారు.

శశికళ వివరణ ఇవ్వాల్సిందే

శశికళ వివరణ ఇవ్వాల్సిందే

అన్నాడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శి టీటీవి దినకరన్ కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఇచ్చిన వివరణ ఇచ్చే అధికారం లేదన్నారు.


ఈ మేరకు ఎన్నికల కమీషన్ స్పష్టం చేసినట్టుగా తమిళనాడు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.పరప్పర ఆగ్రహర చెరలో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ పదో తేదిలోపుగా ఏ రూపంలో వివరణ ఇస్తారోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

English summary
The election commission on Friday refused to accept TTVDinakaran's response on Sasikala Natarajan's appointment asAIADMK's interim general secretary. The election commission heldthat TTV Dinakaran cannot be held as office bearer and thus hisresponse on behalf of Sasikala Natarajan cannot be accepted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X