వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎం తరలింపు... పోలింగ్ ముగిశాక.. అసోంలో వెలుగులోకి...

|
Google Oneindia TeluguNews

అసోంలో గురువారం(ఏప్రిల్ 1) రెండో విడత పోలింగ్ ముగిసిన కొద్ది గంటలకు ఓ షాకింగ్ వీడియో వెలుగుచూసింది. అందులో ఓ బీజేపీ ఎమ్మెల్యే తన కారులో ఈవీఎం మెషీన్‌ను తరలిస్తున్నాడు. ఆ కారు( AS 10B 0022) పథార్‌కండి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కృషేందు పాల్‌కు చెందినదిగా గుర్తించారు. అసోంకి చెందిన ఓ జర్నలిస్ట్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీంతో ఈవీఎంల భద్రతపై ప్రతిపక్షాలు అనుమానాలు లేవనెత్తుతున్నాయి.ఈవీఎం మెషీన్‌ను ఒక ఎమ్మెల్యే తన వాహనంలో తరలించడమేంటని ప్రశ్నిస్తున్నాయి.

ఇలా బయటపడింది...

ఇలా బయటపడింది...

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం రెండో విడత పోలింగ్ జరిగింది. రాత్రి 10.30గంటల సమయంలో కరీంగంజ్‌ జిల్లాలోని కనిసైల్ ప్రాంతంలో ఓ తెల్లరంగు బొలెరో కారు అనుమానాస్పదంగా తిరగడాన్ని స్థానికులు గమనించారు. దీనిపై కారు డ్రైవర్‌ను ఆరా తీసేందుకు వెళ్లగా... అతను కారు దిగి పారిపోయాడు. ఎందుకిలా పారిపోయాడా అని కారు లోపల చూడగా... వెనుక సీట్లో ఒక ఈవీఎం మెషీన్ కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న జర్నలిస్ట్ అతాను భుయాన్ అక్కడికి వెళ్లి ఆ సీన్‌ను వీడియో తీశాడు. ఆపై దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఆ కారు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కృషేందు పాల్‌దేనని స్థానికులు చెప్తుండటం అందులో వినిపిస్తోంది.

ధ్రువీకరించిన ఎన్నికల కమిషన్...

ధ్రువీకరించిన ఎన్నికల కమిషన్...

ఆ కారు ఎమ్మెల్యే కృషేందు పాల్‌దేనని ఎన్నికల కమిషన్ కూడా ధ్రువీకరించింది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో.. తన పేరిట AS 10B 0022 నంబర్‌ గల వైట్ బొలెరో కారు ఉన్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నాడని వెల్లడించింది. రతాబరిలోని ఎంవీ స్కూల్ పోలింగ్ కేంద్రం నుంచి ఆ ఈవీఎం మెషీన్‌ను తరలించినట్లు తెలిపింది. దీనిపై జిల్లా ఎన్నికల అధికారి సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఈసీ ఆదేశించింది. ఆ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది.

ప్రియాంక గాంధీ ఫైర్...


ఎమ్మెల్యే కారులో ఏకంగా ఈవీఎం మెషీన్‌నే తరలిస్తూ పట్టుబడిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ట్విట్టర్‌లో స్పందించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ...'ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఇలా ఈవీఎంలను ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తున్న వీడియోలు బయటపడుతూనే ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే... ఆ వాహనాలు బీజేపీ నేతలు లేదా వారి అనుచరులకు చెందినవై ఉంటాయి. ఈ వీడియోలను బయటపెట్టినవారినే నిందితులుగా చూపేందుకు బీజేపీ తన మీడియాను ఉపయోగిస్తుంది. ఇప్పటికే ఇలాంటివి చాలా బయటపడ్డ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ఘటనలు ఈసీ తీవ్రంగా పరిగణించాలి.' అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

English summary
A video surfaced on social media allegedly showing an electronic voting machine (EVM) in what was claimed to be the car of a BJP candidate in Assam. Following the incident, the Election Commission has sought a detailed report on the incident from Karimganj District Election Officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X