బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసమ్మతి: పూర్తి మంత్రి వర్గం లేదు, సీఎం కుమారస్వామి, జేడీఎస్ దారిలో కాంగ్రెస్, టైం ఫిక్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మంత్రి వర్గం విస్తరణకు రంగం సిద్దం అయ్యింది. అయితే కర్ణాటకలో పూర్తి మంత్రి వర్గం విస్తరణ ఇప్పట్లో ఉండదని మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. అసమ్మతి నేతలకు భయపడి పూర్తి మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్,జేడీఎస్ నాయకులు వెనకడుగు వేస్తున్నారని సమాచారం.

Recommended Video

సిద్దరామయ్యను గెలిపించడం కోసమేనా??
సీఎం వివరణ

సీఎం వివరణ

బుధవారం మద్యాహ్నం 2 గంటలకు జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మొత్తం 34 మంత్రులు బుధవారం ప్రమాణస్వీకారం చెయ్యడం లేదని సీఎం కుమారస్వామి మంగళవారం మీడియాకు చెప్పారు.

కాంగ్రెస్, జేడీఎస్

కాంగ్రెస్, జేడీఎస్

కర్ణాటక-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవులు పంపకం పూర్తి అయ్యింది. కాంగ్రెస్ కు 22 మంత్రి పదవులు, జేడీఎస్ 12 మంత్రి పదవులు తీసుకుంటున్నాయి. జేడీఎస్ బీఎస్పీ శాసన సభ్యుడు ఎన్. మహేష్ కు మంత్రి పదవి ఇస్తుండటంతో ఆ పార్టీకి కేవలం 11 మంత్రి పదవులు దక్కుతున్నాయి.

సీఎం గ్యాంగులో 8 మంది

సీఎం గ్యాంగులో 8 మంది

బుధవారం మద్యాహ్నం 2 గంటలకు జేడీఎస్ కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాకు చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల కారణంగా మిగిలిన మూడు మంత్రి పదవులు ఎవ్వరికీ ఇవ్వడం లేదని, తరువాత కేటాయిస్తామని సీఎం కుమారస్వామి అన్నారు.

జేడీఎస్ దారిలో కాంగ్రెస్

జేడీఎస్ దారిలో కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ సైతం 22 మంత్రి పదవులు ఇప్పుడే కేటాయించే అవకాశం లేదని సమాచారం. జేడీఎస్ దారిలోనే కొన్ని మంత్రి పదవులు కేటాయించి మిగిలిన మంత్రి పదవులు ఖాళీగా పెట్టి తరువాత కేటాయించాలని నిర్ణయించారని తెలిసింది.

English summary
Cabinet expansion will be held at 2 pm tomorrow (June 6). However, the chief minister HD Kumaraswamy said that the full-fledged cabinet will not come into existence tomorrow for political reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X