'పులి ఆకలితో ఉంది.. వేటాడటమొక్కటే దానికి తెలుసు'!!
'పులి ఆకలితో ఉంది.. వేటాడే సమయంలో ఆ పులికి కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ అంటూ హద్దులేవీ ఉండవు.. దానికి వేటాడటం మాత్రమే తెలుసు' అని మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన చేసిన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లోకి మరోసారి అడుగుపెడుతున్నట్లు ఆయన పరోక్షంగా వెల్లడించారు.
బళ్లారిలోని 25వ వార్డు కార్పొరేటర్ గోవిందరాజులు ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డితో కలిసి గాలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరికీ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్నప్పుడు ఓ బాలుడు పులి వేషంలో దుస్తులు ధ]రించి ఎదురయ్యాడని.. తనని చూసి పులి వచ్చిందంటూ అభిమానంతో పిలిచాడని చెప్పారు. ఇప్పుడు ఆ పులి వేటాడడానికి సిద్ధమైందని వ్యాఖ్యానించారు.

తాను రాజకీయాలకు దూరమై పుష్కర కాలం గడిచిందని, ఎంతమంది విమర్శిస్తున్నా అన్నీ మౌనంగా భరిస్తున్నానని, తనకు బెంగళూరులో విలాసంగా జీవించే అవకాశం ఉన్నా.. బళ్లారి ఒక్కటే తనకు ముఖ్యమన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ తాను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. న్యాయస్థానంలో తనక న్యాయం లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బళ్లారి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (బుడా) అధ్యక్షుడు మారుతీప్రసాద్, పలువురు బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మూడురోజుల క్రితం కర్ణాటక హైకోర్టు గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చింది. రివాల్వర్ లైసెన్స్ ను పునరుద్ధరించుకోకుండా దాన్ని తనదగ్గర అట్టిపెట్టుకోవడంపై కేసు నమోదైంది. ఈ కేసులో సోమశేఖర్ రెడ్డి దోషి అని తేల్చింది. ఏడాది జైలు శిక్ష విధించాలనుకున్నప్పటికీ పలు షరతులతో విడుదల చేసింది. వాటిని ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications