వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నడ లోకానికి గూగుల్ క్షమాపణ-'అసహ్యకరమైన భాష' వివాదంపై సెర్చ్ దిగ్గజం రియాక్షన్

|
Google Oneindia TeluguNews

కన్నడ భాషను అసహ్యకరమైన భాషగా పేర్కొంటూ గూగుల్ సెర్చ్‌లో వచ్చిన రిజల్ట్స్ తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. కన్నడ లోకమంతా దీనిపై భగ్గుమనడంతో గూగుల్ యాజమాన్యం క్షమాపణ చెప్పక తప్పలేదు. జరిగిన తప్పిదానికి,కన్నడ ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు గూగుల్ క్షమాపణలు తెలియజేసింది. అదే సమయంలో నిజానికి ఈ అభిప్రాయాలు గూగుల్‌కు సంబంధం లేనివి అని వివరణ ఇచ్చింది.

Recommended Video

Kannada Ugliest Language కన్నడ గొప్పతనాన్ని తెలిపేలా నెటిజన్ల పోస్టులు Google Apologizes |Oneindia

'సెర్చ్ రిజల్ట్స్ ఎల్లప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉండవు. కొన్నిసార్లు, కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలకు ఇంటర్నెట్‌లో ఆ కంటెంట్ వివరించబడిన విధానం ఆశ్చర్యకర రీతిలో ఉంటుంది. ఇది సరైనది కాదని మాకు తెలుసు. అందుకే సమస్య గురించి తెలియగానే దిద్దుబాటు చర్యలకు పూనుకుంటాం. సంబంధిత అల్గారిథంను మెరుగుపరిచేందుకు నిరంతరం పనిచేస్తుంటాం. నిజానికి సెర్చ్ రిజల్ట్స్‌లో చూపించే కంటెంట్ గూగుల్‌ అభిప్రాయం కిందకు రాదు.ఏదేమైనా జరిగిన అపార్థానికి,ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాం.' అని గూగుల్ స్పష్టం చేసింది.

Google Apologizes For Showing Kannada As Worlds Ugliest Language

గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో భారత్‌లో అసహ్యకరమైన భాషగా కన్నడ భాషను చూపించడంతో ఈ వివాదం చెలరేగింది.debtconsolidationsquad.com అనే వెబ్‌సైట్‌లో ఈ కంటెంట్ కనిపించింది. క్షణాల్లో ఇంటర్నెట్‌లో ఇది వైరల్‌ కావడంతో కన్నడ లోకమంతా దీనిపై భగ్గుమన్నది. ప్రభుత్వంతో పాటు పలువురు పలు సంస్థలు గూగుల్‌పై చట్టపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన గూగుల్ ఆ కంటెంట్‌ను తొలగించి క్షమాపణలు తెలియజేసింది.

మరోవైపు కన్నడ గొప్పతనాన్ని తెలిపేలా సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కన్నడ భాషకు 2500 ఏళ్ల చరిత్ర ఉందని... ఆరు కోట్ల మంది ప్రజలు ఈ భాష మాట్లాడుతున్నారని చెబుతున్నారు. కన్నడ సాహిత్యంలో ఇప్పటివరకూ 8 మందికి జ్ఞానపీఠ పురస్కారాలు వరించాయని గుర్తుచేస్తున్నారు. ద్రవిడ భాషల్లో అత్యంత పురాతన భాషల్లో ఇదొకటని గుర్తుచేస్తున్నారు. ప్రతీ భాషకు దానిదైన ప్రత్యేకత ఉంటుందని దేన్ని కించపరచకూడదని హితవు పలుకుతున్నారు.

English summary
As Google courted controversy on Thursday morning with angry netizens aiming sharp criticism at the search engine giant for showing Kannada as the 'world's ugliest language,' the California-based tech company has issued an apology for hurting the sentiments of Indian people. Reasoning that the search results are not always perfect, a Google spokesperson on Thursday admitted that the search result was not ideal and that it does not 'reflect the opinions' of Google.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X