హెచ్1బి వర్క్ వీసాకు దరఖాస్తుల ఆహ్వానం: యూఎస్ ఇమిగ్రేషన్

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: హెచ్1బి ప్రీమియం వీసాలను ఏప్రిల్ 3నుంచి నిలిపివేస్తున్నట్లు అమెరికా ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో హెచ్1బి వర్క్ వీసాకు అదే తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఇమిగ్రేషన్ సర్వీస్ సంస్థ(యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది.

అంతకుముందు ఏడాది వరకు దరఖాస్తు గడువు తేదీలపై స్పష్టతనిస్తూ వచ్చిన ఇమిగ్రేషన్ సర్వీస్ సంస్థ.. ఈ ఏడాది మాత్రం దరఖాస్తుల గడువుకు సంబంధించి ఎటువంటి స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. సాధారణంగా హెచ్1బి వర్క్ వీసా దరఖాస్తుల స్వీకరణ మొదలైన తేదీ నుంచి ఐదు పనిదినాల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.

H1B work visa applications process from april 3rd

2017 అక్టోబర్ 1తో మొదలయ్యే 2018 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుతం దరఖాస్తులను ఆహ్వానించారు. అమెరికా కాంగ్రెస్ నిర్ణయించిన 85వేల హెచ్1బి వీసాల మంజూరు మేరకు తగినన్ని దరఖాస్తులు గత సంవత్సరం వరకు వచ్చాయి. 85వేల వీసాల్లో 65వేలు జనరల్ కేటగిరీ వారికి, 20వేలు అమెరికా విద్యాసంస్థల్లో పీజీ లేదా ఉన్నత విద్య చదివిన విదేశీయులకు ఇవ్వాలనే నిబంధన ఉంది.

అయితే పరిశోధన కోసం అమెరికా వెళ్లేవారికి ఇచ్చే వీసాల విషయంలో మాత్రం ఎటువంటి పరిమితి లేదు. అయితే ఏప్రిల్ 3నుంచి ప్రీమియం వర్క్ వీసాలను నిలిపివేస్తుండటంతో వీరి వీసా ప్రక్రియకు ఆటంకం ఏరప్పడింది.

హెచ్‌1బి వీసాలతో పోల్చితే అదనంగా 1,225 డాలర్లు చెల్లించటం ద్వారా కేవలం పదిహేను రోజుల్లోనే ప్రీమియం వీసాలను అందుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు దీన్ని నిలిపివేయడంతో చాలామందికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇక ఫామ్ ఐ-129 ఫీజును సైతం 460డాలర్లకు పెంచడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US Immigration announced the notification to invite applications for h1b visa's. From April 3rd onwards procedure will be start
Please Wait while comments are loading...