Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Handsome CM: సార్... మీరు చాలా అందంగా ఉన్నారు, రోడ్డు మీద సీఎంకు పవర్ ఫుల్ పంచ్, రమ్యా ఎవరు !

చెన్నై/క్రిష్ణగిరి/బెంగళూరు: ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఆ సీఎం సిద్దంగా ఉన్నారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన సీఎం ప్రజలు సమస్యలు తెలుసుకోవడానికి, వివిధ కార్యక్రమాల్లో పాల్టొనగానికి ఓ జిల్లాకు వెళ్లారు. అందరు ప్రజల లాగే ఓ సామాన్య మహిళ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సమస్య గురించి సీఎంకు వివరించడానికి రోడ్డు పక్కన నిలబడి ఉంది.

అందరితో పాటు గుంపులో గోవిందా అంటూ ఆమె నిలబడింది. సీఎం కారు నిలుతారని, తాను మాట్లాడాతాను అని ఆమె ఊహించలేదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో వెలుతున్న సీఎం కాన్వాయ్ ఆ మహిళ నిలబడి ఉన్న చోట ఆగింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది కారు డోడ్ తియ్యడంతో సీఎం కారు దిగారు. ఆ సమయంలో అక్కడ నిలబడి ఉన్న మహిళ సార్ మీ ముఖానికి వేసుకున్న మాస్క్ తీస్తారా, ఒక్కసారి నేరుగా మిమ్మల్ని చూడాలని చెప్పింది. వెంటనే చిరునవ్వుతో సీఎం ముఖానికి ఉన్న మాస్క్ తీశారు. సీఎంను నేరుగా అతి దగ్గర నుంచి చూసిన ఆ మహిళ సార్ మీరు చాలా హ్యాండ్సమ్ గా, స్మార్ట్ గా ఉన్నారు, ఈ వయసులో కూడా మీరు చాలా అందంగా కనపడుతున్నారు అని చెప్పడంతో అక్కడ ఉన్న సమాన్య ప్రజలు, సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు, మంత్రులు షాక్ అయ్యారు.

ఏదో సమస్య పరిష్కరించాలని సీఎంకు మనవి చేస్తుంది అనుకుంటే ఈమె ఏమిటి వచ్చిన పని మరిచిపోయి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా నరసింహాలో రమ్యకృష్ణ రజనీకాంత్ కు వేసినట్లు పంచ్ డైలాగ్ వేసింది అని అనుకున్నారు. అయితే ఆమె చెప్పిన మాటకు నవ్వుకున్న సీఎం ఆమె చేతిలో ఉన్న వినతి పత్రం తీసుని మీకు తరువాత ఫోన్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం స్మార్ట్ గా ఉన్నావని ఆయనకే డైరెక్టు చెప్పిన రమ్యా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. అంతే కాదు తరువాత సీఎం రమ్యాకు ఫోన్ చెయ్యడం, ఆమె సీఎంతో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీఎంతో మాట్లాడిన రమ్యా ఎవరు ?, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ?, కాలేజ్ లో చదివే కూతురు ఉన్న ఆ మహిళ సీఎంకు అంత డైరెక్టుగా మీరు చాలా స్మార్ట్ ఉన్నారని ధైర్యంగా ఎలా చెప్పింది ? అంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైయ్యింది.

 పవర్ ఫుల్ సీఎం

పవర్ ఫుల్ సీఎం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ కు అభిమానుల్లో, డీఎంకే పార్టీ కార్యకర్తల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంకే. స్టాలిన్ ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించారు. తండ్రి ఎం. కరుణానిధి రాజకీయ వారసుడిగా కొనసాగుతున్న ఎంకే. స్టాలిన్ ఇటివల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకున్నారు. భారీ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో స్టాలిన్ కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం అయ్యారు.

క్రిష్ణగిరి జిల్లాకు సీఎం

క్రిష్ణగిరి జిల్లాకు సీఎం

తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఎంకే. స్టాలిన్ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కరోనా వైరస్ ను కూడా లెక్క చెయ్యకుండా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కర్ణాటక సరిహద్దులోని క్రిష్ణగిరి జిల్లాలో ఈనెల 5వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ పర్యటించారు. సీఎం స్టాలిన్ పర్యటన సందర్బంగా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని సీఎం స్టాలిన్ కు వినతి పత్రాలు సమర్పించారు.

 కరెక్టుగా అక్కడే సీఎం కాన్వాయ్ ఆగింది

కరెక్టుగా అక్కడే సీఎం కాన్వాయ్ ఆగింది

అందరు ప్రజలు లాగే రమ్యా అనే ఓ సామాన్య మహిళ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సమస్యల గురించి సీఎంకు వివరించడానికి రోడ్డు పక్కన నిలబడి ఉంది. రమ్యాకు 42 సంవత్సరాలు. అందరితో పాటు గుంపులో గోవిందా అంటూ రమ్యూ కూడా నిలబడింది. సీఎం స్టాలిన్ కారు నిలుతారని, తాను మాట్లాడాతాను అని రమ్యా అస్సలు ఊహించలేదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో వెలుతున్న సీఎం ఎంకే. స్టాలిన్ కాన్వాయ్ రమ్యా నిలబడి ఉన్న చోట ఒక్కసారిగా ఆగింది.

సార్..... ఒక్కసారి మాస్క్ తీస్తారా

సార్..... ఒక్కసారి మాస్క్ తీస్తారా

అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో వెలుతున్న సీఎం స్టాలిన్ కాన్వాయ్ రమ్యా నిలబడి ఉన్న చోట ఆగడంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది కారు డోడ్ తియ్యడంతో సీఎం స్టాలిన్ కారు దిగారు. ఆ సమయంలో అక్కడ నిలబడి ఉన్న రమ్యా సార్ మీ ముఖానికి వేసుకున్న మాస్క్ ఒక్కసారి తీస్తారా, ఒక్కసారి నేరుగా మిమ్మల్ని చూడాలని ఉంది అని చెప్పింది. వెంటనే చిరునవ్వుతో సీఎం స్టాలిన్ ఆయన ముఖానికి ఉన్న మాస్క్ పక్కకు తీశారు.

 మీరు చాలా హ్యాండ్సమ్ గా... అందంగా ఉన్నారు సార్

మీరు చాలా హ్యాండ్సమ్ గా... అందంగా ఉన్నారు సార్

తమిళనాడు సీఎం స్టాలిన్ ను నేరుగా అతి దగ్గర నుంచి చూసిన రమ్యా వచ్చిన పని మరిచిపోయి సార్ మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, ఈ వయసులో కూడా మీరు చాలా అందంగా కనపడుతున్నారు అని చెప్పడంతో అక్కడ ఉన్న సమాన్య ప్రజలు, సెక్యూరిటీ సిబ్బంది, మంత్రులు, అధికారులు, సామాన్య ప్రజలు, మీడియా మిత్రులు షాక్ అయ్యారు. ఏదో సమస్య పరిష్కరించాలని సీఎం స్టాలిన్ కు రమ్యా మనవి చేస్తుందని అనుకుంటే ఈమె ఏమిటి సూపర్ స్టార్ రజనీకాంత్ నరసింహా సినిమాలో రమ్యకృష్ణ తలైవాకు వేసినట్లు పంచ్ డైలాగ్ వేసింది అని అనుకుని షాక్ అయ్యారు.

 థ్యాక్స్ చెప్పిన సీఎం

థ్యాక్స్ చెప్పిన సీఎం

సామాన్య మహిళ రమ్యా వేసిన డైలాగ్ తో నవ్వుకున్న సీఎం స్టాలిన్ ఆమెకు థ్యాక్స్ అమ్మా అని చెప్పి ఆమె చేతిలో ఉన్న వినతి పత్రం తీసుకుని మీకు తరువాత ఫోన్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం స్టాలిన్ స్మార్ట్ గా ఉన్నారని ఆయనకే డైరెక్టు చెప్పిన రమ్యా హాట్ టాపిక్ అయ్యారు. అక్కడున్న మీడియా సిబ్బంది రమ్యాను ఇంటర్వూ తీసుకుని టీవీలల్లో వైరల్ చేశారు. నా సమస్య గురించి వినతి పత్రంలో పూర్తిగా వివరించి నా పేరు, ఫోన్ నెంబర్ రాసి ఆ వినతి పత్రం సీఎం స్టాలిన్ కు ఇచ్చానని, సార్ నాకు కచ్చితంగా ఫోన్ చేస్తారనే నమ్మకం ఉందని రమ్యా ఆ రోజు మీడియాకు చెప్పింది. అనుకున్నట్లే రమ్యాకు సీఎం స్టాలిన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

 మీరు తలుచుకుంటే నిజం అవుతుంది

మీరు తలుచుకుంటే నిజం అవుతుంది

సీఎం స్టాలిన్ ఫోన్ చెయ్యడంతో రమ్యా కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. సార్ మా సమస్య గురించి మీకు వివరించాను. మీ నాన్నగారు (ఎం. కరుణానిధి) ముఖ్యమంత్రిగా బాగా పని చేశారు. మీరు కూడా తమిళనాడులో రోడ్లు బాగా వేయించి, ప్రజలకు నీటి సమస్య లేకుండా ప్రజలను బాగా చూసుకుంటారని అనుకుంటున్నామని, మీ నాన్నగారి లాగా మీరు చాలా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశపడుతున్నామని రమ్యా సీఎం స్టాలిన్ కు ఫోన్ లో చెప్పింది. తప్పకుండా మీ కోరికలు అన్నీ నేరవేరుస్తామని, ప్రజలకు మంచి చెయ్యడానికి తనకు ఈ అవకాశం వచ్చిందని సీఎం స్టాలిన్ రమ్యాకు ఫోన్ లో చెప్పారు.

 రమ్యాకు కాలేజ్ లో చదివే కూతురు ఉంది

రమ్యాకు కాలేజ్ లో చదివే కూతురు ఉంది

సీఎం స్టాలిన్ తో రమ్యాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా మాట్లాడారు. రమ్యా కూతురు దివ్యా సీఎం స్టాలిన్ తో మాట్లాడుతూ సార్ నేను ఇంటర్ (12వ తరగతి) చదువుతున్నానని, ఆన్ లైన్ క్లాసుల్లో చదువుతూ చాలా బోరు కొడుతోందని, కాలేజ్ లు తెరిపించాలని సీఎం స్టాలిన్ కు మనవి చేసింది. కరోనా వైరస్ పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చిన వెంటనే అన్ని విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయని, అంత వరకు ఓపిక పట్టాలని సీఎం స్టాలిన్ అన్నారు. మరోసారి తల్లి రమ్యా, ఆమె కూతురు దివ్యా మీరు చాలా అందంగా, హ్యాండ్సమ్ గా ఉన్నారని, ఈ వయసులో కూడా మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారని సీఎం స్టాలిన్ కు చెప్పారు. రమ్యా, ఆమె కుమార్తె దివ్యాకు మరోసారి థ్యాక్స్ చెప్పిన సీఎం స్టాలిన్ తరువాత ఫోన్ కట్ చేశారు.

 వీడియో వైరల్

వీడియో వైరల్

సీఎం స్టాలిన్ తో రమ్యా ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో ఆమె కుటుంబ సభ్యులు వీడియో తీశారు. సీఎం స్టాలిన్, రమ్యా మాట్లాడినంత సేపు వీడియో తీసిన కుటుంబ సభ్యులు ఆనందంతో తట్టుకోలేక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. స్వయంగా సీఎం స్టాలిన్ ఫోన్ చేసి మాట్లాడటంతో రమ్యా కుటుంబ సభ్యుల ఆనందానికి అవదులు లేకుండాపోయాయి.

 రమ్యా ఎవరు ?..... ఇప్పుడు ఇదే హాట్ టాపిక్

రమ్యా ఎవరు ?..... ఇప్పుడు ఇదే హాట్ టాపిక్

సీఎం స్టాలిన్ తో మాట్లాడిన మహిళ రమ్యా ఎవరు ?, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ?, కాలేజ్ లో చదివే కూతురు ఉన్న రమ్యా సీఎంతో డైరెక్టుగా మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారని ఎంత ధైర్యంగా ఎలా చెప్పింది ? అంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైయ్యింది. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మా సీఎం స్టాలిన్ ఎప్పుడు ముందు ఉంటారని, ఆయన ప్రజల మనిషి అని డీఎంకే నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. చాలా మంది సీఎంలు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించిన విషయం మనం చాలాసార్లు చూశాము. అయితే స్టాలిన్ సీఎం అయిన తరువాత రోడ్డు పక్కన ఎక్కడంటే అక్కడ కాన్వాయ్ నిలిపి ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుంటూ వారికి ఇంకా దగ్గర అవుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల స్టాలిన్ విషయంలో చాలానే జరిగాయి. మొత్తం మీద క్రిష్ణగిరి మహిళ రమ్యా ఇప్పుడు తమిళనాడుతో పాటు తమిళ ప్రజలు నివాసం ఉంటున్న అన్ని రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది. ఒక్క డైలాగ్ తో రమ్యా హాట్ టాపిక్ అయిపోయింది.

Recommended Video

    Spl coverage on Mothkupally comments on Dalit Bandhu
     సీఎంతో మాట్లాడిన రమ్యా నేడు ?

    సీఎంతో మాట్లాడిన రమ్యా నేడు ?

    తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ తో మాట్లాడిన క్రిష్ణగిరి జిల్లాకు చెందిన రమ్యా ఇప్పుడు సోషల్ మీడియాలో, తమిళ ప్రజల ముందు సెలబ్రిటీ అయిపోయారు. సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వారి పదవులు కాపాడుకోవడానికి ముఖ్యమంత్రులను, పార్టీ చీఫ్ ను పొగడం, వారిని ఆకాశానికి ఎత్తేయడం సర్వసాధారణంగా జరుగుతుంటోంది. అయితే తమ సమస్యల గురించి సీఎం ఎంకే. స్టాలిన్ కు వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నించిన ఒక సర్వసాధారణ మహిళ సీఎంకు పవర్ ఫుల్ పంచ్ వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. నరసింహా సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో నీకు వయసు పెరిగినా నీ అందం మాత్రం దగ్గర లేదు అని డైలాగ్ వేసిన రమ్యకృష్ణ (నీలాంబరి), సీఎం స్టాలిన్ కు పవర్ ఫుల్ పంచ్ వేసిన మహిళ పేరు రమ్యా కావడం ఇక్కడ విశేషం. రమ్యా అనే పేరులోనే పవర్ ఫుల్ పంచ్ ఉందనుకుంటున్నారు అందరూ.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+