దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

బ్రెయిన్ ట్యూమర్ మరియు ఊపిరితిత్తులు ఫెయిలైన కొడుకును కాపాడుకోవడంలో ఓ నిస్సహాయ తండ్రి పోరాటం

By Ramesh Babu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  నా 6 ఏళ్ల కొడుకు ఆనంద్ 210 రోజులుగా ఇంటికి దూరంగా.. ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆనంద్‌కు 'రికరెంట్ అనాప్లాస్టిక్ బ్రెయిన్‌స్టెమ్ ఎపెండిమోమా'అని 2014లో వైద్యులు తేల్చారు. ఇప్పటి వరకు నా కొడుకు మెదడులో మూడు ట్యూమర్లు పుట్టుకొచ్చాయి. ఒక్కో ట్యూమర్ పుట్టుకొచ్చినప్పుడల్లా మా జీవితం అల్లకల్లోలమే అయింది.

  నా కొడుకు చావుబతుకుల మధ్య సాగిస్తున్న పోరాటం నా జీవితంలో నేను ఎదుర్కొన్న కష్టాల్లో అత్యంత క్లిష్టమైనది. ప్రస్తుతం నా కొడుకు వెంటిలేటర్ సహాయంతో శ్వాస పీల్చుకుంటున్నాడు, నోటిలోకి చొప్పించిన ట్యూబుల సహాయంతో ఆహారం తీసుకుంటున్నాడు. అతడి ఊపిరితిత్తుల్లోకి.. మెదడులోకి నేరుగా గొట్టాల ద్వారా మందులు పంపుతున్నారు. ఇవేవీ అతడి నుంచి దూరం చేయలేం, ఎందుకంటే నా కొడుకు జీవిస్తున్నదే వాటిపైన. చివరికి అతడి మాల, మూత్ర విసర్జన కూడా ఈ గొట్టాల ద్వారానే జరుగుతోంది. ఇప్పుడు రేడియోథెరపీ చేయాలంటున్నారు. దీనికి రూ.7 లక్షలు ఖర్చవుతుంది. 9 నెలలపాటు ఈ చికిత్స అవసరమట. దేవుడు మా పక్షాన లేకపోతే ఇంకా మరిన్ని నెలలపాటు నా కొడుక్కి ఈ రేడియోథెరపీ చేయాల్సి రావచ్చు. అంత డబ్బు నా దగ్గర లేదు. దయచేసి నా కొడుకుని కాపాడుకునేందకు సాయం చేయండి.

  Helpless Father Struggling To Save Son With Brain Tumor & Failed Lungs

  నా పేరు విక్రం సింగ్. ఆనంద్ నాకొడుకు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ మా ఊరు. నేను ఉద్యోగరీత్యా అక్కడికి చాలా దూరంలో ఉండేవాడిని. నేను కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాను. నెలకు రూ.15 వేలు నా జీతం. ఇన్నాళ్లూ నేను కష్టపడి దాచిన డబ్బంతా నా కొడుకు చికిత్సకే ఖర్చుపెట్టేశాను. ఇప్పటి వరకు రూ.11 లక్షలు ఖర్చయింది. ఇకమీద పెట్టడానికి నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. నా కొడుకుని, భార్యను వదిలి వెళ్లలేని కారణంగా నేను 12 నెలలుగా నా ఉద్యోగానికి కూడా వెళ్లడం లేదు.

  అసలిదంతా 2014లో ఓ మాయదారి జ్వరంతో వచ్చింది. జ్వరం కారణంగా నా కొడుకు ఆనంద్ తినే తిండి కూడా తగ్గిపోయింది. ఓ రోజు అతడి తల పక్కకు వాలిపోవడంతో మేం చాలా భయపడిపోయాం. అతడి మెడ.. తల బరువును కూడా మోయలేకపోతోంది. వెంటనే మా కొడుకుని తీసుకుని ఆసుపత్రికి పరిగెత్తాం. దాదాపు నెల రోజులపాటు కొన్ని పరీక్షలు చేసిన తరువాత అతడి మెదడులో కణితిని డాక్టర్లు పసిగట్టారు. శస్త్రచికిత్స చేసి దానిని తొలగించకపోతే అతడి ప్రాణాలకే ప్రమాదమన్నారు. అతితక్కువ వ్యవధిలో నేను రూ.6 లక్షల డబ్బు జమచేశాను. ఆ డబ్బుతో ముంబైలోని ఆసుపత్రిలో నా కొడుక్కి బ్రెయిన్ ట్యూమర్ అపరేషన్ జరిగింది. ఆ తరువాత మూడేళ్లపాటు నా కొడుకు ఆనందంగా జీవించాడు. ఆ తరువాత...

  2016 డిసెంబర్‌లో మళ్లీ నా కొడుక్కి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. మళ్లీ అవే లక్షణాలు. నాకెందుకో అనుమానం కలిగింది. మళ్లీ అతడికి ట్యూమర్ మాత్రం రాకూడదని నాకు నేనే ధైర్యం చెప్పుకునేవాడిని. ఏదైతే రాకూడదనుకున్నానో అదే వచ్చింది. మళ్లీ అతడి మెదడులో కణితి.. దాంతోపాటే ఈసారి క్యాన్సర్ కూడా. 2017 జనవరిలో మళ్లీ నా కొడుకుని ముంబైలోని ఆసుపత్రిలో చేర్చాం. కొన్ని నెలలపాటు కిమియోథెరపీ చేశారు. దీంతో నా కొడుకు ఆనంద్ కాస్త కోలుకున్నట్లు కనిపించాడు. కానీ చివర్లో ఇచ్చిన కిమియోథెరపీ స్ట్రాంగ్ డోస్‌తో నా కొడుకు ఊపిరితిత్తులు ఫెయిల్ అయ్యాయి.

  విక్రమ్ తన కొడుక్కి జరుగుతోన్న రేడియోథెరపీకి అయ్యే ఖర్చును భరించేందుకు ఇబ్బందిపడుతున్నాడు. కొడుకుని కాపాడుకోవడంలో మీరిచ్చే విరాళాలు అతడికి సహాయపడతాయి.

  మా జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజులివి. నెల రోజులపాటు నా కొడుకు స్పృహ లేకుండా పడి ఉన్నాడు. నెలరోజులుగా అయితే అతడు ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్నాడు. అతడి మొఖంలో నవ్వు చూసి చాలాకాలమైంది. అసలు అతడి శరీరంలో ఎలాంటి కదలికా లేదు. జస్ట్.. గాలిపీల్చి వదలుతున్నాడు అంతే. నా భార్య, కూతురు రోజూ అతడి పక్కనే ఉంటున్నారు. అతడితో మాట్లాడుతూ, కథలు చెబుతూ.. అతడ్ని తిరిగి స్పృహలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

  2017 మే 3 నుంచి ఆనంద్‌లో కాస్తంత మొండితనం కూడా కనిపిస్తోంది. ఒక్కరోజు ..' డాక్టర్లను పిలవండి.. ఇంజెక్షన్ సిరంజిలంటే నాకేం భయం లేదు..' అనేవాడు. కొన్నిసార్లు ఇంటికెళ్లిపోదామని గొడవ చేసేవాడు. నాకూ నా కొడుకుని ఇంటికి తీసుకెళ్లిపోవాలనే అనిపించేది. వాడి శరీరానికి అమర్చి ఉన్న ఈ మిషన్లు, గొట్టాలు లేకుండా వాడిని చూసి ఎంతకాలమైందో.

  ఇక ఏ శస్త్ర చికిత్సా అతడి పరిస్థితిని మెరుగుపరచలేదని వైద్యులు చెప్పేశారు. అతడికి కావలసింది 9 నెలలపాటు నిరంతరాయంగా రేడియోథెరపీ ఇవ్వడమే. అతడికి ఉపయోగిస్తున్న మిషన్లు, అన్ని ఖర్చులు కలుపుకుని ప్రతి వారం రూ.2 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. నా స్నేహితులు, బంధువులు దగ్గర్నుంచి తీసుకొచ్చిన డబ్బుతో ఇప్పటి వరకు అతడి చికిత్స కోసం చెల్లించాను. ఇక ఇప్పుడేం చేయను? ఏ ఆదాయమూ లేదు, మరో 9 నెలలపాటు చికిత్స చేయించాలి. ఇప్పటివరకు నా కొడుకెంతో బాధపడ్డాడు. దయచేసి నన్ను ఈ కష్టంలోంచి బయటపడేయండి.

  కొడుకుని కాపాడుకోవడంలో విక్రంకి సాయం చేయాలనుకుంటే ఫండ్ రైజర్ కెట్టో ద్వారా ఇక్కడ మీరు విరాళాలు అందించవచ్చు.

  English summary
  My 6-year-old son Anand has been in the hospital kilometres away from home, since the last 210 days. Anand was diagnosed with a condition called ‘Recurrent Anaplastic Brainstem Ependymoma’ in 2014. Since his diagnosis, his brain has shown presence of tumours three times, shattering our world every single time. Seeing my son battle hardships is one of the most difficult things I’ve done in my life. Today, my son is breathing with the help of a ventilator, eating with the help of tubes inserted in his mouth, getting medicines directly into his lungs and brain through pipes. He cannot be taken off these machines, they’re keeping him alive.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more