Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశంలో రైళ్ళ రద్దీలో 41శాతం 7 మార్గాల్లోనే.. హై డెన్సిటీ నెట్‌వర్క్ కారిడార్లు ఇవే!

దేశవ్యాప్తంగా రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులతో ప్రగతి పథంలో దూసుకుపోతుంది. భారతీయ రైల్వే వందే భారత్ రైళ్ల సేవలతో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ దూసుకుపోతుంది. ప్రయాణికుల భద్రతకు, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుంది. ఇదే క్రమంలో భారతీయ రైల్వే లోని హైడెన్సిటీ కారిడార్లలో రద్దీని తగ్గించడానికి కూడా ఇండియన్ రైల్వే వ్యూహాలు రచిస్తోంది.

రైల్వే ట్రాఫిక్ లో 41% ఏడు కారిడార్లు
భారతీయ రైల్వేలో అత్యంత రద్దీగా ఎక్కువ రైళ్ళు నడిచే ప్రధాన మార్గాలను హైడెన్సిటీ నెట్వర్క్ కారిడార్లు అని అంటారు. ఇవి భారతదేశంలోని ట్రాఫిక్ లో పెద్దభాగాన్ని నిర్వహించే రైలు మార్గాలు. ప్రస్తుతం మనదేశంలో రైల్వే ట్రాఫిక్ లో 41% ఏడు కారిడార్లు నిర్వహిస్తున్నాయి. ఈ అత్యధిక ట్రాఫిక్ ని నిర్వహించే హైడెన్సిటీ నెట్వర్క్ రైల్వే కారిడార్లు దేశ ఆర్థికవ్యవస్థకు రైల్వే నెట్వర్క్ లో ఈ కారిడార్లు వెన్నెముకగా ఉంటాయి.

High-density network corridors that handle 41 percent of the country rail traffic

అత్యధిక రైళ్ల రాకపోకలతో కీలకంగా నెట్వర్క్
ఈ కారిడార్ల ద్వారా ప్రయాణికుల రైళ్ళు మాత్రమే కాకుండా సరుకు రవాణా రైళ్లు కూడా భారీ సంఖ్యలో నడుస్తాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో రైళ్లు ప్రయాణించే ఈ నెట్వర్క్ అత్యధిక రైళ్ల రాకపోకలతో నిర్వహించబడుతుంది. బొగ్గు, ఫుడ్ గ్రైన్, స్టీల్, ఆయిల్ వంటి సరుకు రవాణా రైళ్లు మాత్రమే కాక, ప్రయాణికుల రవాణా రైళ్లకు కూడా ఈ నెట్వర్క్ కీలకంగా పనిచేస్తుంది.

దేశంలో హై డెన్సిటీ రైల్వే నెట్వర్క్ లు 7
మనదేశంలో ప్రధాన హై డెన్సిటీ రైల్వే నెట్వర్క్ లు 7 దేశంలోని రైల్వే ట్రాఫిక్ లో 41% భారాన్ని మోస్తున్నాయి. అవి ఢిల్లీ - హౌరా కారిడార్, ఢిల్లీ - ముంబై కారిడార్, ముంబై -చెన్నై కారిడార్, హౌరా- చెన్నై కారిడార్, ఢిల్లీ- చెన్నై కారిడార్, ముంబై -అహ్మదాబాద్ - ఢిల్లీ మార్గం, పంజాబ్- ఢిల్లీ -యూపీ- బీహార్ కారిడార్లు దేశంలోని రైల్వే ట్రాఫిక్ లో అత్యధిక శాతాన్ని మోస్తున్నాయి.

60% కంటే ఎక్కువ ఈ మార్గాల నుండే సరుకు రవాణా
సరుకు రవాణాలో 60% కంటే ఎక్కువ ఈ మార్గాల నుండే వెళ్తుంది. కనుక ఈ మార్గాలపైన రద్దీ తగ్గించే ప్రయత్నాన్ని భారతీయ రైల్వే చేస్తోంది. సరుకు రవాణా రైళ్లను వేరు చేసే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లను ఏర్పాటు చేస్తోంది. వందే భారత్, బుల్లెట్ ట్రైన్ వంటి కొత్త మార్గాల ద్వారా ఈ రూట్లపైన భారాన్ని తగ్గించనుంది.

రైల్వే హైడెన్సిటీ కారిడార్ల పైన భారాన్ని తగ్గించే యత్నం
హై స్పీడ్ మార్గాల విభజన ద్వారా ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా హైడెన్సిటీ నెట్వర్క్ కారిడార్ పైన భారాన్ని తగ్గించనుంది. త్రిబుల్, ఫోర్ లైనింగ్ పనులను చేపట్టి ప్రత్యక్ష రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. స్టేషన్ మరియు యార్డు ఆధునీకరణ ద్వారా కూడా రైల్వే హైడెన్సిటీ కారిడార్ల పైన భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+