వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాస్ పోర్ట్ కోసం ధరఖాస్తు చేసిన గుర్రం, ఆడి కారు కంటే ఆ గుర్రానికే ధర ఎక్కువ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హర్యానా :విదేశాలకు వేళ్ళేందుకు పాస్ పోర్టు అవసరం .సాధారణంగా విదేశాల్లోని పర్యాటక ప్రదేశాలను చూసేందుకు, బందువలును కలిసేందుకు చదువులకోసం వెళ్లుంటారు. విదేశాలకు వెళ్ళేందుకు పాస్ పోర్ట్ తప్పనిసరి. జంతువులు కూడ విదేశాలకు వెళ్ళాల్సి వస్తే ఏం చేయాలి.... జంతువులు కూడ పాస్ పోర్ట్ తప్ననిసరి.అయితే ఓ గుర్రం యజమానికి తన గుర్రం విదేశాలకు వెళ్ళేందుకు పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేశాడు.

విదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఆ గుర్రానికి పాస్ పోర్ట్ అవసరమైంది. వెంటనే ఆ గుర్రం యజమాని పాస్ పోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే దేశవాళీ పోటీల్లో విజేతగా నిలిచిన ఆ గుర్రం విదేశాల్లో కూడ తన సత్తా చాటేందుకు సిద్దమైంది. దేశంలో జరిగిన అనేక పోటీల్లో ఈ గుర్రం పలు పతకాలను సాధించింది.విదేశాల్లో జరిగే పోటీల్లో మరిన్నిపతకాలను సాధించాలని ఆ గుర్రం యజమాని ఆశిస్తున్నాడు.15 చాంనియన్ షిప్ లను ఈ గుర్రం కైవసం చేసుకొంది. రెండు దపాలు జాతీయ చాంపియన్ షిప్ టైటిల్ ను గెలుచుకొంది.

higher than audi car cost to horse

ప్రత్యేక ఆహారం
అనేక పోటీల్లో పాల్గొనే ఈ గుర్రానికి ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తారు. ఈ గుర్రం కోసం పత్యేకంగా ఒక మనిషిని ఏర్పాటు చేశాడు ఆ గుర్రం యజమాని. ఈ గుర్రం హార్యానా రాష్ట్రంలో ఉంది. హార్యానా రాష్ట్రానికి చెందిన గుర్వీందర్ సింగ్ గుర్రం యజమాని..ఈ గుర్రాన్ని తన స్వంత కుమారుడిలా చూసుకొంటాడు హర్వీందర్ సింగ్. ఈ గుర్రానికి సుల్తాన్ అనే పేరు పెట్టాడు.రోజుకు లీటర్ ఆవు పాలు ఇస్తారు. 100 గ్రాముల నెయ్యితో పాటు ఇతర పదార్థాలను ఆహారంగా పెడతారు.పోటీలకు వెళ్ళే సమయంలో ప్రత్యేక మెనూ గుర్రానికి అందిస్తారు.పలు పతకాలను గెలుచుకోవడంతో ఈ గుర్రం అంటే గుర్వీందర్ సింగ్ కు అమితమైన ప్రేమ.

ప్రత్యేక మెను తో పాటు ప్రత్యేకంగా గుర్రానికి ఏర్పాట్లు చేస్తారు యజమాని గుర్వీందర్. గుర్రం ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాడు. గుర్రానికి ప్రతి రోజూ నీటితో కడగడం లాంటి పనులు చేసేందుకు మనిషిని ఏుర్పాటు చేశాడు.ఈ గుర్ర ఉండే ప్రదేశ: ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా పనిమనుషులు జాగ్రత్తలు తీసుకొంటారు. చిన్న గాయమైనా ఇంటికి వచ్చి వైద్యులు చికిత్స అందిస్తారు.

ఆడీ కారు కంటే ఈ గుర్రానికే ధర ఎక్కువ

అతి ఖరీదైన కార్లలో ఆడి కారును కూడ చెప్పుకోవచ్చు. ఆడి కారు కంటే ఎక్కువ ధరను ఇచ్చి సుల్తాన్ ను కొనుగోలు చేసేందుకు చాలా మంది ముందుకు వచ్చారు. కాని, సుల్తాన్ ను విక్రయించేందుకు గుర్వీందర్ సింగ్ మాత్రం సిద్దంగా లేడు.చాలా మంది ఈ గుర్రాన్ని విక్రయించాలని పలు రకాలుగా కోరినా ఆయన మాత్రం నిరాకరించాడు. ఆడి కారులోని ఏ 4 కారు ధర సుమారు 41 లక్షలు. కాని, సుల్తాన్ అనే ఈ గుర్రం ధర మాత్రం51 లక్షలు.హర్యానాలోని కర్నాల్ దర్బీ గ్రామానికి చెందిన గుర్వీందర్ సింగ్ ను ఈ గుర్రాన్ని విక్రయించాలని ఓ వ్యక్తి 51 లక్షలు ఇస్తానని ముందుకు వచ్చాడు. అయితే గుర్వీందర్ సింగ్ మాత్రం ఒప్పుకోలేదు.

దేశంలోని పలు పోటీల్లో విజయం సాధించిన సుల్తాన్ గుర్రం గురించి చాలా మందికి తెలుు. అయితే పాస్ పోర్ట్ లభించి విదేశాల్లో పోటీల్లో ఆ గుర్రం పాల్గొని విజయాలు సాధిస్తే ఆ గుర్రం పై క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. పాస్ పోర్ట్ అధికారులు ఈ గుర్రానికి పాస్ పోర్ట్ ఇస్తారో లేదో చూడాలి.

English summary
gurvinder singh live in karnaldharbi village in haryana stae.he has horse , this orht is more than audi car. an one offered to gurvindersingh to sell his horse 51 lakhs. audi car a4 model cost is 41 lakhs.this horse win various tests. gurvinder applied passport for his horse .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X