వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలబలాలు: 116 నుంచి 106కి పడిపోనున మెజార్టీ మార్క్..? కమల వికాసమే..?

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. జ్యోతిరాదిత్య సింధియా ధిక్కారస్వరంతో కాంగ్రెస్ ప్రభుత్వం పీఠాలు కదిలాయి. జ్యోతిరాదిత్య వర్గానికి చెందిన 17 మంది, కమల్‌నాథ్‌కు వ్యతిరేకులైన మరో ముగ్గురు కూడా రాజీనామా బాట పట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు స్పీకర్‌కు 14 మంది ఈ-మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. సింధియా ధిక్కారంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది.

అసెంబ్లీలో బలబలాలు..

అసెంబ్లీలో బలబలాలు..

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 230 కాగా మెజార్టీ మార్క్ 116 సభ్యుల. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించింది. కానీ బీఎస్పీ ఇద్దరు, ఎస్పీ ఒకరు, ఇండిపెండెంట్లు నలుగురి మద్దతుతో బలం 21కి చేరింది. కానీ క్రమంగా అసమ్మతి రాజేసింది. దీనికి కారణం జ్యోతిరాదిత్య సింధియాకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి.. మాట తప్పేలా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించడమే.. సింధియా తిరుగుబాటు ఎగరేశాక, రాజ్యసభ, పీసీసీ చీఫ్ పదవులు ఇస్తామని కమల్‌నాథ్ చెప్పిన ఫలితం లేకుండా పోయింది.

 97కి పడిపోయిన కాంగ్రెస్ బలం

97కి పడిపోయిన కాంగ్రెస్ బలం

కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది రాజీనామా చేయడంతో సభలో సభ్యుల సంఖ్య 213కి చేరుతోంది. అంటే అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 106 అవుతోంది. కాంగ్రెస్ పార్టీ 114 సీట్ల నుంచి 97కి పడిపోగా.. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తోంది. 107 మంది సభ్యులతో అధికారం చేపట్టేందుకు సిధ్దంగా ఉంది. గవర్నర్ విచక్షణ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తే.. కమలదళం 15 నెలల తర్వాత అధికారం చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఎస్పీ, బీఎస్సీ ముగ్గురు సభ్యులు మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. బీజేపీకి కలిగే ప్రయోజనం ఉండదు. ఇండిపెండెంట్లను కూడా క్రమంగా బీజేపీ తమ వైపునకు తిప్పుకునే అవకాశం ఉంది.

Recommended Video

Jyotiraditya Scindia Resigns From Congress! | Oneindia Telugu
ఇదీ కారణం

ఇదీ కారణం

మధ్యప్రదేశ్‌లో గత కొద్దికాలంగా అసంతృప్త జ్వాల ఎగిసిపడుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు, రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరిగినా.. చివరికి ప్రియాంక గాంధీ కేటాయించాలని ఒక వర్గం పట్టుబడుతోంది. దీంతో తనకు అన్యాయం జరగడం ఖాయమని ముందే అనుకొన్ని సింధియా.. తన వర్గంతో క్యాంప్ వేసి.. కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించారు.

English summary
Congress in Madhya Pradesh is in deep trouble after 17 MLAs loyal to Jyotiraditya Scindia were flown to BJP-ruled Karnataka on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X