వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనదేశంలో ఓటు వేయడం ఎలా?: పోలింగ్ స్టేషన్ వెళ్లేముందు సిద్ధమవ్వండిలా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశంలో ఇప్పుడు ఎన్నికల సందడి నెలకొంది. ఓ వైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండగా, వచ్చే రెండు నెలల్లోనే ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఓటు వేసేవారు, లేదా ఓటు వేసే వారు పోలింగ్ స్టేషన్‌కు వెళ్లే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

ఓటు వేయడం ఎలా..?

- మీకు 18ఏళ్లు లేదా ఆపై వయస్సు ఉండాలి.
- మీరు భారతదేశ పౌరుడై ఉండాలి.
- ఎలక్టోరల్ రోల్స్‌లో మీ పేరు ఉందా అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. ఇందుకోసం ఎలక్టోరల్ ఆఫీసర్స్ వెబ్‌సైట్ పరిశీలించాలి.
- లోకల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా ఓటరు జాబితాను పరిశీలించుకోవచ్చు.
- ఓటర్ ఐడీ లేదా ఇతర ఫోటో గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్ మీ వద్ద ఉంచుకోవాలి.
- మీ ఇంటి వద్దకే వచ్చి ఓటర్ స్లిప్ ఇచ్చి వెళతారు.
- ఒక వేళ మీకు ఓటర్ స్లిప్ ఇవ్వకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలింగ్ బూత్‌ కౌంటర్స్‌లో రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్ల వద్ద పొందవచ్చు.

How to vote in India

- పోలింగ్ బూత్ వద్ద మీ ఓటర్ స్లిప్, ఐడీలు సిద్ధంగా ఉంచుకోవాలి.
- ఓ పోలింగ్ అధికారి.. ఓటరు జాబితాలో, గుర్తింపు కార్డులో మీ పేరును పరిశీలిస్తారు.
- మరో అధికారి మీ వేలికి ఇంక్ అంటిస్తారు. ఆ తర్వాత ఓ చీటీ ఇస్తారు.
- మూడో అధికారి ఆ చీటిని చెక్ చేస్తారు.
- అప్పుడు మీరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉండాలి.
- ఈవీఎంలో మీరు ఎన్నుకోవాల్సిన అభ్యర్థికి చెందిన బటన్‌పై మీరు నొక్కాలి.
- మీరు ఓటు వేసిన తర్వాత ఓ స్లిప్ వస్తుంది. ఈ వీఎం పక్కనే ఉన్న ఓటర్ వెరిఫియేబుల్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్) వద్ద దాన్నిచూడవచ్చు.
- సీల్డ్ బాక్స్‌లోని గ్లాస్ కేసులో ఇది మనకు కొద్ది సెకన్లపాటు కనిపిస్తుంది.

English summary
With so many elections coming up, you must exercise your franchise. Before you go to the polling station, there are some pre-requisites which have to be abided by.
Read in English: How to vote in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X