షాక్: భార్య అందంగా ఉందని ...భర్త ఏంచేశాడంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: భార్యపై అనుమానంతో భర్తే యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగుళూరు కేజీ నగర పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకొంది.

చెన్నేగౌడ, మంజును 17 ఏళ్ళ క్రితం వివాహం చేసుకొన్నాడు. చెన్నేగౌడ ఆటో‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంజుల గార్మెంట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు తోటి ఉద్యోగితో వివాహేతర సంబంధం ఉుందని భర్త నిత్యం వేధించేవాడు.

దీంతో నాలుగురోజుల క్రితం మంజుల గార్మెంట్ కంపెనీలో ఉద్యోగాన్ని కూడ మానేసింది. తన భార్య అందంగా ఉండడంతోనే అందరూ తన భార్యను చూస్తున్నారని ఆమెను అందవిహీనంగా చేయాలనే దుర్బుద్ది చెన్నేగౌడకు కలిగింది.

acid attack on wife in banglore

దీంతో శుక్రవారం రాత్రి ఆమెపై యాసిడ్‌తో దాడి చేశారు చెన్నేగౌడ. తీవ్రంగా గాయపడిన మంజులను స్థానికులు వెంనే విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. మంజులకు 50 శాతం గాయాలయ్యాయి.

ఆమె ఎడమకన్ను పూర్తిగా దెబ్బతిందని వైద్యులు చెప్పారు.బాధితురాలు మంజులను రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయి శనివారంనాడు ఆసుపత్రిలో పరామర్శించారు,

మహిళా కమిషన్ తరపున ఆమెకు రూ.3లక్షలను చెక్‌ను అందించారు. ఆమెకు ప్రతినెలా రూ.3వేలను పెన్షన్ అందిస్తామని, రూ.20 లక్షలవరకు వైద్యఖర్చులను భరిస్తామని మహిళ కమిషన్ చైర్మెన్ నాగలక్ష్మీబాయి ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
48 year old Chennegowda was an auto driver. His beautiful wife Manjula worked at a garments factory. They have 2 children 15 year old daughter and 12 year old son. The family of four lived in Sanyasipalya in Kempegowdanagar, Bengaluru.On 15 July, Saturday a visibly fuming Chennegowda entered house with a fresh allegation of illicit affair on Manjula. The argument between the couple reached peaks and Chennegowda took out a bottle of acid and splashed on his wife.
Please Wait while comments are loading...