వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్‌లో ఉద్యోగాలకోసం వచ్చే ముందు ఓసారి వీసా సరిచూసుకోండి

|
Google Oneindia TeluguNews

దుబాయ్‌లో ఉద్యోగాల కోసం అడుగు పెట్టేముందు భారతీయులు ప్రవాసి భారతీయ సహాయ కేంద్రంలో తమ వీసా స్టేటస్‌లు ఒక్కసారి సరిచూసుకోవాలని కోరింది దుబాయ్‌లోని భారత కాన్సులేట్. 2017లో 17 మంది భారతీయులు నకిలీ ఎంప్లాయ్‌మెంట్ వీసాపై దుబాయ్‌కు వచ్చారని గుర్తు చేసింది. అమెర్ వెబ్‌సైట్‌పై కూడా ఉద్యోగం చేయదలచినవారు తమ వీసా స్టేటస్ సరిచూసుకోవచ్చని పేర్కొంది. లేబర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ది కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ దుబాయ్ వెబ్‌సైట్‌లో కూడా వీక్షించి సరిచూసుకోవచ్చని కాన్సులేట్ తెలిపింది.

వీసా మంజూరులో చాలామందికి నకిలీ వీసాలు మంజూరైనట్లు ఫిర్యాదులు వస్తున్నాయని కాన్సుల్ జనరల్ విపుల్ తెలిపారు. ఇందుకోసం 2017లో ఇద్దరు సలహాదారులను నియమించినట్లు ఆయన వెల్లడించారు. విజిటింగ్ వీసాలపై వచ్చి ఇక్కడే ఇరుక్కుపోయిన వారికోసం ఒక సలహాదారుడిని నియమించగా... ఎంప్లాయిమెంట్ వీసాలపై పలువురు భారతీయులు వస్తుండగా వారీ వీసాలను ఎడిట్ చేసి దుబాయ్‌లోనే అక్రమంగా ఉంటున్నవారికోసం నియమించినట్లు విపుల్ తెలిపారు. అందుకే ప్రయాణంకు సిద్ధపడేముందు మరొకసారి వీసాలను చెక్ చూసుకోవాలని విపుల్ సూచిస్తున్నారు.

India consulate warns UAE jobseekers over visa status

ఇదిలా ఉంటే గత రెండు మూడు నెలల్లో దుబాయ్‌లో వీసా మోసాలు పెద్దగా వెలుగులోకి రాలేదని విపుల్ తెలిపారు. ఇదిలా ఉంటే మూడు నాలుగు నెలల క్రితం ఇలా వీసా మోసాల బారిన పడి ఇరుక్కుపోయిన ఒడిషా వ్యక్తులను గుర్తించి లేబర్ డిపార్ట్‌మెంట్ తిరిగి ఒడిషాకు పంపిందని విపుల్ చెప్పారు. ఇలాంటి కేసులు పెరిగిపోతుండటంతో విదేశాంగ మంత్రిత్వశాఖ ఇలా వీసాల పేర్లతో ప్రజలను మోసం చేస్తున్నవారినై కఠినంగా వ్యవహరించాలని కోరారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భారత సంతతి వ్యక్తులు ఆదేశ జనాభాలో దాదాపు 30శాతం మంది ఉన్నారు.

English summary
The Indian mission in Dubai has warned people jobseekers to check their visa status with the Pravasi Bharatiya Sahayata Kendra (PBSK), folllowing the deportation of 17 Indians who came into the UAE with fake employment visas in 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X