గాలిలో విమానాన్ని కూల్చేసిన క్షిపణి -డీఆర్డీవో తయారీ క్యూఆర్‌సామ్ పరీక్ష విజయవంతం
భారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసే దిశగా కీలక ప్రణాళికలు రూపొందించుకున్న రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో అడుగు ముందుకు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కీలక క్షిపణుల్ని శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది.
Recommended Video
అన్ని రకాల వాతావరణాల్లో పనిచేసే 'క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్ సామ్) క్షిపణుల్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా లోని చందీపూర్ లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ల ద్వారా మధ్యాహ్నం 3.40 గంటలకు ఈ అధునాతన క్షిపణులను పరీక్షించారు.

గాలిలో ప్రయాణిస్తోన్న పైలట్ రహిత బన్షీ విమానాన్ని లక్ష్యంగా నిర్దేశించగా, ఆ విమానాన్ని క్యూఆర్ సామ్ మిస్సైల్ గురితప్పకుండా తాకింది. మీడియం రేంజి, మీడియం ఆల్టిట్యూడ్ లో ఈ పరీక్షల్ని చేపట్టారు. యుద్ధ రంగంలో శత్రు విమానాలను కూల్చగల సత్తా ఉన్న ఈ క్షిపణి పరిధి 30 కిలోమీటర్లు. క్యూఆర్ సామ్ తయారీలో 'ఇన్స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(ఐఆర్డీఈ)కూడా పాలుపంచుకుంది.
క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్ఎస్ఏఎమ్)కు సంబంధిచి డీఆర్డీవో పరీక్షలు విజయవంతం కావడంతో తదుపరి దశలో స్వల్ప రేంజ్ క్షిపణిని ఆర్మీ, వైమానిక దళం పరీక్షించనుంది. ఆ తర్వత ఉత్పత్తిలోకి వెళ్లేముందు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ లతో ఉద్రిక్తతలు పెరుగుతోన్న నేపథ్యంలో భారత్ మిస్సైళ్ల తయారీ, పరీక్షలకు ప్రాధాన్యం ఏర్పడింది.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications