వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘన స్వాగతం: మోడీ బస అక్కడే, ప్రత్యేకత ఇదే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ లండన్ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం లండన్ హీత్రూ విమానాశ్రయానికి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు. బ్రిటిష్ హైకమిషనర్‌గా ఉన్న జేమ్స్ బీవెన్ నేతృత్వంలోని బృందం ప్రధానిని పూలమాలతో సత్కరించి ఆహ్వానించింది.

విమానాశ్రయం బయట వందలాది మంది భారత సంతతి యువతీ యువకులు, 'మోడీ మోడీ' అన్న నినాదాలతో ఆయనకు స్వాగతం పలుకగా, మోడీ సైతం చిరునవ్వుతో, వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మోడీ పర్యటనను ఎవరైనా అడ్డుకోవచ్చన్న ఉద్దేశంతో బ్రిటన్ భద్రతాదళాలు భారీ బందోబస్తును ఏర్పాటు చేశాయి.

Indian PM Modi arrives in UK for three day visit

తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ గురువారం రాత్రి 'చక్కర్స్'లో బస చేయనున్నారు. 44 సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ బసచేసిన చోటనే ఇప్పుడు మోడీ బస చేయడం విశేషం. అనంతరం ఈరోజు రాత్రి 9.20 గంటలకు బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని మోడీనే. ముందుగా మోడీ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్‌ను కలుస్తారు. ఆ తర్వాత ప్రధాని కెమరూన్‌తో కలసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొంటారు. బ్రిటన్ పారిశ్రామిక వేత్తలతో మోడీ సమావేశమవుతారు.

హాక్ యుద్ధ శిక్షణ విమానాల కొనుగోలుపై బ్రిటన్‌తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నాయి. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని విజయవంతం చేయడమే ఈ పర్యటన లక్ష్యంగా ప్రధాని మోడీ అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో ల్యాండ్ రోవర్ ప్లాంట్‌ను నరేంద్ర మోడీ సందర్శించనున్నారు.

బ్రిటన్ రాణి ఎలిజబెత్ తన నివాసమైన బకింగ్ హామ్ ప్యాలెస్‌లో ఏర్పాటుచేసే విందులో మోడీ పాల్గొంటారు. వెంబ్లీ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. సుమారు 60 వేల మంది ఈ ఈవెంట్‌కు హాజరుకానున్నారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమరూన్ స్వాగతోపన్యాసం ఇస్తారు. టర్కీలో జరిగే జి-20 సదస్సుకు మోడీ హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు.

English summary
India's Prime Minister Narendra Modi has arrived in the UK for a three day visit as a guest of his British counterpart, David Cameron.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X