దేశంలోనే చిట్టచివరి గ్రామం.. ధనుష్కోడి అందాలు.. ఎలా చేరుకోవాలి..?
భారతదేశం అంటేనే ఎన్నో వింతలు.. విశేషాలకు నెలవు. ఎన్నో చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు, సముద్రాలు, జలపాతాలు.. కనువిందు చేస్తాయి. అయితే దక్షిణ భారత్ లో రెండు సముద్రాల మధ్య ఓ గోడలా ఉన్న ఈ గ్రామం గురించి తెలిస్తే షాక్ అవుతారు. దేశంలోనే చిట్టచివరి గ్రామంగా పేరుగాంచింది. రెండు సముద్రాల నడుమ ఉన్న ఇక్కడి బీచ్ ను చూసేందుకు భారత్ నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా పర్యటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు.
లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన గ్రామమే తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలోని 'ధనుష్కోడి'.. దేశంలోనే చిట్టిచివరి గ్రామంగా దీనికి పేరుంది. ప్రముఖ శైవ క్షేత్రం రామేశ్వరానికి సుమారు 19 కిమీల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం నెలకొని ఉంది. భారత్, శ్రీలంకను కలిపే రామ సేతు(ఆడమ్స్ బ్రిడ్జ్) ఈ గ్రామంలోనే ఉంది. రెండు సముద్రాల మధ్య ఉన్న ఈ పర్యాటక ప్రాంతాన్ని చూసేందుకు టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తుంటారు. 2016 కు ముందు వరకు ఈ ప్రాంతాన్ని ఆస్వాదించాలంటే సముద్రంలోనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం రోడ్డు మార్గం నిర్మించింది. దాంతో ఈ ప్రాంతం లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది.
అయితే ఈ ధనుష్గోడి ప్రాంతానికి ఓ దీనమైన చరిత్ర కూడా ఉంది. 1964 డిసెంబర్ 22, 23 తేదీల్లో వచ్చిన భయంకరమైన తుపాను కారణంగా ధనుష్కోడి పట్టణం పూర్తిగా మునిగిపోయింది. ఈ విపత్తులో గ్రామంలోని దాదాపు 1800 మంది మరణించారు. ఓ రైలు కూడా సముద్రంలో కొట్టుకుపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఈ ప్రదేశాన్ని ఘోస్ట్ టౌన్ గా పిలిచేవారు. ఆ తర్వాతి కాలంలో పర్యటకుల కోసం ఈ పట్టణాన్ని పునర్నిర్మించారు. ఇటీవలికాలంలో ధనుష్గోడి కి పర్యటకుల తాకిడి అధికం అయింది.
ఓవైపు బంగాళాఖాతం.. మరోవైపు హిందూ మహాసముద్రం మధ్యలో చిన్న గ్రామంగా ఉంటుంది. ఇక్కడి బీచ్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పర్యటకులు ఎక్కువగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఈ పర్యాటక ప్రాంతానికి విచ్చేస్తుంటారు. రామేశ్వరం ఆలయాన్ని దర్శించుకున్నాక అనేక మంది ఇక్కడికి వస్తుంటారు. రామేశ్వరం నుంచి రోడ్డు మార్గంలో కేవలం 20 కి. మీ. దూరంలోనే ఈ పర్యాటక ప్రాంతం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి రామేశ్వరం చేరుకుని.. అక్కడినుంచి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

ఇక హైదరాబాద్ నుంచి రామేశ్వరం దూరం దాదాపు 1200 కి. మీ. ఉంటుంది. ఇక్కడకు ట్రైన్ లేదా ఫ్లైట్ తో వెళ్లవచ్చు. ఇక రోడ్డు ప్రయాణం అయితే.. హైదరాబాద్ నుంచి కర్నూలు, అనంతపురం, బెంగళూరు, సేలం, మధురై, అక్కడినుంచి రామేశ్వరం (NH44 & NH38) చేరుకోవచ్చు. అలాగే కాచిగూడ నుంచి డైరెక్ట్ రైళ్లు కూడా ఉంటాయి. పూర్తి వివరాలకు IRCTC యాప్ లో చెక్ చేయండి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యటకులు ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications