వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఇన్స్‌పెక్టర్ ఇలా, మానవత్వాన్ని మంటగలిపారు

రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ ఇన్స్ పెక్టర్ ను ఆసుపత్రికి తరలించకుండా,ప్రమాదం జరిగిన తీరుపై ఫోటోలు తీసుకొంటూ చోద్యం చూశారు స్థానికులు.అయితే ఆసుపత్రికి పోలీసులే వచ్చి తరలించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

మైసూర్:మాయమైపోతున్నాడమ్మా, మనిషన్నవాడు ..మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు అంటూ అందెశ్రీ పాట రాశాడు. ఈ పాట అచ్చంగా బెంగుళూరులో జరిగిన ఘటనకు సరిపోతోంది. ప్రాణాపాయంలో ఉన్న ఓ పోలీసులకు సహయం చేయాల్సిందిపోయి ఫోటోలు దింపుతూ చోద్యం చూశారు స్థానికులు.

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు జీపు, బస్సు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు.

జీపులో ప్రయాణిస్తోన్న ఇన్స్ పెక్టర్ మహేష్ కుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. కొన ఊపిరితో రోడ్డుపై పడి ఉన్నాడు.అయితే మహేష్ కుమార్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

inspector died in road accident

అయితే ఎంతో మంది అతణ్ణి చూస్తూనే ఉండిపోయారు. స్థానికులు గుంపులుగా నిలబడి ఫోటోలు తీస్తూ చోద్యం చూశారు.కనీసం ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహేష్ కుమార్ ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించలేదు.

స్థానిక పోలీసులకు సమాచారం అందింది, వారు వచ్చి మహేష్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్టుగా పోటీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించకుండా ఇబ్బందిపెట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశించినా మార్పు రాలేదు. ఫోటోలు తీసేందుకు తీసుకొన్న సమయం ఆసుపత్రికి తరలించేందకు కేటాయిస్తే ఓ నిండు ప్రాణం దక్కేది.

English summary
Inspector died in road accident at bangalore. mahesh kumar injured in road accident near mysore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X