వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలిసారి ఇండోర్‌లో: ఐఏఎంఏఐ ఆధ్వర్యంలో ‘యాప్స్ జాబ్ ఫెస్ట్’

|
Google Oneindia TeluguNews

ఇండోర్: ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ) ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో శుక్రవారం నిర్వహించిన ‘యాప్స్ జాబ్ ఫెస్ట్‌'లో 250మంది యాప్ డెవలపర్స్, 12 ఇంటర్నెట్ కంపనీలు పాల్గొన్నాయి. ఈ జాబ్ ఫెస్ట్‌ అనేది ద్వితీయ శ్రేణి నగరాల యాప్స్ డెవలపర్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. వారికి మార్గనిర్దేశనం చేస్తుంది.

ఐఏఎంఏఐ ఈ తరహా కార్యక్రమాలను ద్వితీయ శ్రేణి నగరాలైన పుణె, అహ్మదాబాద్, ఛండీఘర్‌ లాంటి నగరాల్లో త్వరలో చేపట్టనుంది. యాప్స్ డెవలప్‌మెంట్‌లో గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు వచ్చే ఐదు సంవత్సరాల్లో 5లక్షల మంది యాప్ డెవలపర్లకు యాప్స్ జాబ్ ఫెస్ట్ శిక్షణ ఇవ్వనుంది. యాప్స్ జాబ్ ఫెస్ట్ అనేది మొబైల్ 10ఎక్స్ ప్రాథమిక ప్రయత్నం.

ఉత్తమ యాప్స్ ఇంక్యూబేటింగ్, క్యూరేటింగ్‌లకు కూడా ఈ కార్యక్రమం తోడ్పాటునందించనుంది. ప్రస్తుతమున్న ప్రపంచంలోని 1000 యాప్స్‌లో 10శాతం భారత్ నుంచే సప్లై కావాలనేది ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.

 Internet and Mobile Association of India hosts 1st ever 'apps job fest' in Indore

ప్రస్తుతం 50వేల కంటే తక్కువగానే యాప్స్ డెవలపర్స్ ఉన్నారని, 1000 గ్లోబల్ యాప్స్‌లో భారతదేశం వాటా 1శాతం కంటే తక్కువగా ఉందని, దీన్ని వచ్చే ఐదేళ్లలో 10శాతానికి పెంచాలని మొబైల్ 10ఎక్స్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

యాప్స్ డెవలపర్స్, యువత, వాణిజ్యం, ఇంటర్‌ప్రిన్యూరల్‌‌ల మధ్య సంబంధాలను మెరుగుపర్చడం, సృజనాత్మకత ఆలోచనలను కలిగించడం, జీవావరణ ఎకానమీ యాప్స్ సృష్టించడం అనేది ఐఏఎంఏఐ ముఖ్య కార్యక్రమంగా పెట్టుకుంది. మొబైల్ 10ఎక్స్ కార్యక్రమం ప్రధానంగా యాప్స్ డెవలపర్స్, యువత, వాణిజ్యం, ఇంటర్‌ప్రిన్యూరల్‌‌ల మధ్య వారధిగా పని చేయనుంది.

కాగా, ఇండోర్ నగరంలో ఐఐటి, ఐఐఎంలను కలిగివుంది. అంతేగాక, అన్ని వసతులతో కూడిన 60 ఇంజినీరింగ్ కళాశాలుండటంతో ఐఏఎంఏఐ తన తొలి యాప్స్ జాబ్ ఫెస్ట్‌ను ఈ నగరం నుంచే ప్రారంభించింది. కాగా, ఇండోర్ నగరంలో యాప్స్ డెవలప్‌మెంట్ కేంద్రంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

English summary
250 apps developers and 12 Internet Companies participated in an Apps Job Fest organized by the Internet and Mobile Association of India (IAMAI) in Indore on Friday, June 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X