రూ.200 నోటు విడుదల: దోరగా వేయించిన దోశంటూ నెటిజన్లు...
రూ.200 కొత్త నోటును ఆర్‌బిఐ ప్రవేశపెట్టింది.ఈ నోటు కోసం ఆర్‌బిఐ వద్ద క్యూలు కట్టారు.కొత్త నోటుపై సోషల్‌మీడియాలో నెటిజన్లు విపరీతంగా స్పందించారు.
న్యూఢిల్లీ: వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్‌బిఐ రూ.200 డినామినేషన్ కరెన్సీని శుక్రవారం నాడు ప్రవేశపెట్టింది. కొత్త రూ. 200 రూపాయాల నోటు కోసం రిజర్వ్‌బ్యాంకుల వద్ద కస్టమర్లు పెద్ద ఎత్తున క్యూ కట్టారు.
దేశ రాజధానిలోని కొత్త నోట్ల కోలాహలం నెలకొంది. కొత్త నోట్లు చేజిక్కించుకునేందుకు పోటీ పడ్డారు. రూ.50, రూ.200 నోట్ల కోసం ఎగబడ్డారు. రిజర్వ్ బ్యాంకు శుక్రవారంనాడు కొన్ని ఎంపిక చేసిన ఆర్‌బీఐ శాఖలు, బ్యాంకుల ద్వారా రూ.200 నోట్లను మార్కెట్లోకి విడుదల చేసింది.

రూ.200 రూపాయల డినామినేషన్ కరెన్సీ నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టడం దేశంలోనే ఇది తొలిసారి. అయితే కొత్త నోట్లు ఏటీఎంల ద్వారా చలామణిలోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది.
ధోరగా వేయించిన దోశ మాదిరిగా
కొత్త రూ. 200 నోటుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేశారు. నోటు రంగు మీదే చాలా మంది నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. కాషాయ రంగులో ఉన్న ఈ నోటు దోరగా వేయించిన దోశను తలపిస్తుందని, బాగా మరగబెట్టిన ఇరానీ చాయ్ రంగులో ఉందని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
నోటును వినాయక చవితి రోజు విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ కూడా మోదీ ప్రభుత్వం హిందుత్వాన్ని చూపిస్తుందని విమర్శిస్తున్నారు. ఇప్పటికి వరకు విడుదల చేసిన రూ. 2000, రూ. 500, రూ. 200, రూ. 50 నోట్లన్నీ అమ్మాయిలకు బాగా ఇష్టమైన రంగుల్లోనే ఉన్నాయన్నారు. మరి అబ్బాయిలకోసం నోట్లు ప్రచురించరా? అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే మార్కెట్‌లో పప్పు ధర రూ. 200 దాటిందని, అందుకే రూ. 200 నోటును పప్పు రంగులో ముద్రించారని నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications