గాలి జనార్దన్ రెడ్డి ఫ్యామిలీకి చెక్, బీజేపీ రిస్క్, సుష్మాస్వరాజ్ ఎంట్రీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా బళ్లారి జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. బీజేపీ నాయకులు ఎవ్వరూ ఊహించని విధంగా రిస్క్ చేసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. బళ్లారి జిల్లాలో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ కు చెక్ పెట్టాలని బీజేపీ నాయకులు నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. బళ్లారి నగర శాసన సభ నియోజక వర్గం నుంచి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ ను కాకుండా కొత్త వ్యక్తిని రంగంలోకి దించాలని బీజేపీ నిర్ణయించిందని సమాచారం.

గాలి సోమశేఖర్ రెడ్డి

గాలి సోమశేఖర్ రెడ్డి

బళ్లారిలో బీజేపీ ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి బెయిల్ డీల్ కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం జామీనుపై బయట ఉన్నారు. బెయిల్ డీల్ కేసులో అరెస్టు అయిన గాలి సోమశేఖర్ రెడ్డికి ఈసారి శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్ ఇవ్వకూడదని ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ నాయకులు బీజేపీ మీద ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలిసింది.

  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: సర్వే!
  గాలి శిష్యులు ఔట్

  గాలి శిష్యులు ఔట్

  గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరులుగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి, బీజేపీ మాజీ నాయకుడు ఆనంద్ సింగ్, కూడ్లగి ఎమ్మెల్యే బి. నాగేంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు బీజేపీకి బళ్లారి జిల్లాలో గాలి జనార్దన్ రెడ్డి ఫ్యామిలీనే దిక్కు అయ్యింది. అయితే ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ మాత్రం గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ కు బదులుగా వేరే వ్యక్తులను తెరమీదకు తీసుకు వచ్చారు.

  డాక్టర్ బీకే. సుందర్

  డాక్టర్ బీకే. సుందర్


  బళ్లారి నగర శాసన సభ నియోజక వర్గం నుంచి గాలి సోమశేఖర్ రెడ్డికి బదులుగా డాక్టర్ బీకే. సుందర్ పేరు తెరమీదకు వచ్చింది. శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దంగా ఉండాలని ఇప్పటికే డాక్టర్ బీకే. సుందర్ కు కర్ణాటక బీజేపీ నాయకులు సూచనలు చేశారని బళ్లారిలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

   సుష్మాస్వరాజ్

  సుష్మాస్వరాజ్

  1999లో లోక్ సభ ఎన్నికల్లో బళ్లారి నుంచి సుష్మాస్వరాజ్ పోటీ చేశారు. అప్పటి నుంచి డాక్టర్ బీకే. శ్రీనివాసమూర్తి కుటుంబ సభ్యులతో సుష్మాస్వరాజ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ డాక్టర్ బీకే. శ్రీనివాసమూర్తి ఇంటి ఆడపడుచు అయిపోయారు. డాక్టర్ శ్రీనివాసమూర్తి కుమారుడే డాక్టర్ బీకే. సుందర్.

  వరమహాలక్ష్మి వ్రతం

  వరమహాలక్ష్మి వ్రతం

  ప్రతి సంవత్సరం డాక్టర్ శ్రీనివాసమూర్తి ఇంటిలో జరిగే వరమహాలక్ష్మి వ్రతం పండగకు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ హాజరౌతారు. ఆవిధంగా డాక్టర్ శ్రీనివాసమూర్తి కుటుంబ సభ్యులకు సుష్మాస్వరాజ్ సంపూర్ణమద్దతు ఉంది. బళ్లారి నగర శాసన సభ నియోజక వర్గం బీజేపీ టిక్కెట్ డాక్టర్ బీకే. సుందర్ కే వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

  గాలి బ్రదర్స్ వ్యతిరేకులు

  గాలి బ్రదర్స్ వ్యతిరేకులు

  బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ ను వ్యతిరేకించే బీజేపీ నాయకులు డాక్టర్ బీకే. సుందర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించడానికి సిద్దం అయ్యారు. డాక్టర్ బీకే. సుందర్ కే టిక్కెట్ ఇవ్వాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ మీద ఒత్తిడి తీసుకు వస్తున్నారు.

  అవినీతి రాజకీయాలు

  అవినీతి రాజకీయాలు


  బెయిల్ డీల్ కేసులో అరెస్టు అయిన గాలి సోమశేఖర్ రెడ్డికి బదులు డాక్టర్ సుందర్ ను రంగంలోకి దించాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ అవినీతి రాజకీయాలకు బళ్లారి నుంచి స్వస్తి చెప్పాలని ప్రయత్నిస్తున్నదని సమాచారం. అయితే గాలి జానర్దన్ రెడ్డి కుటుంభాన్ని కాదని బీజేపీ బళ్లారి రాజకీయాల్లో ఎలా ముందుకు వెలుతుందో వేచి చూడాలని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. బీజేపీ మాత్రం బళ్లారి జిల్లాలో రిస్క్ చెయ్యాలని చూస్తోందని సమాచారం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  BJP high command may surprise everyone by giving ticket to Dr Sundar to contest from Bellary assembly constituency in upcoming elections 2018. BJP is risking by snubbing Gali Janardhan Reddy gang.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి