వైష్ణోదేవి కాలేజీలో ముస్లిం అడ్మిషన్ల రగడ..! రిజర్వేషన్ లేదన్న సీఎం..!
జమ్మూకశ్మీర్ లోని శ్రీ వైష్ణోదేవి మెడికల్ కాలేజీలో ఈ ఏడాది కేటాయించిన 50 ఎంబీబీఎస్ సీట్లకు గానూ 42 మంది ముస్లింలకే అడ్మిషన్లు ఇవ్వడంపై బీజేపీ సహా హిందూ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. వైష్ణోదేవి ఆలయానికి వచ్చే నిధులతో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ కాలేజీలో ముస్లింలకు మెజార్టీ అడ్మిషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. మెడికల్ కాలేజీ అడ్మిషన్లను సమీక్షించకపోతే నిరసనలు తప్పవని హిందూ సంస్థలు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను హెచ్చరించాయి.
ఈ నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా ఇవాళ ఘాటుగా స్పందించారు. శ్రీ మాతా వైష్ణో దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్‌లో అడ్మిషన్లపై వివాదంపై జమ్మూ ,కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ..శ్రీ మాతా వైష్ణో దేవి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అసెంబ్లీ బిల్లును ఆమోదించినప్పుడు, ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన బాలురు, బాలికలను దాని నుండి దూరంగా ఉంచుతామని ఎక్కడ రాసిపెట్టారని ఆయన బీజేపీని ప్రశ్నించారు.

#WATCH | Jammu | On row over admissions in Shri Mata Vaishno Devi Institute of Medical Excellence, J&K CM Omar Abdullah says, "When the Assembly had passed the bill to establish Shri Mata Vaishno Devi University, where was it written that boys and girls belonging to one… pic.twitter.com/jAMp6ZxMjN
— ANI (@ANI) November 24, 2025
విశ్వవిద్యాలయంలో ప్రవేశం మతం ఆధారంగా కాకుండా, మెరిట్ ఆధారంగా మాత్రమే జరుగుతుందని చట్టంలో ఉందని గుర్తుచేశారు. మెరిట్ లేకుండా అడ్మిషన్లు ఇవ్వాలనుకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. లౌకికవాదం' అనే పదం రాజ్యాంగంలో భాగంగా ఉందని, మీరు ఈ దేశాన్ని లౌకికంగా ఉంచకూడదనుకుంటే, ఈ పదాన్ని రాజ్యాంగం నుండి తొలగించాలని బీజేపీకి ఒమర్ సూచించారు. బిజెపికి చెందిన సునీల్ శర్మ మెరిట్ ఆధారంగా అడ్మిషన్ గురించి ప్రస్తావించే సంబంధిత అసెంబ్లీ చట్టాన్ని అధ్యయనం చేయాలని ఆయన కోరారు. మెరిట్ ఆధారంగా అడ్మిషన్ పొందిన అభ్యర్థుల తప్పు ఏమిటన్నారు. అప్పుడు వారు ముస్లింలకు శ్రీ మాతా వైష్ణో దేవి ఆసుపత్రిలో చికిత్స అందదని కూడా స్పష్టంగా చెప్పాలన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications