వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీతం పెంచమని మీ బాస్‌ను అడిగేముందు ఈ 5 టిప్స్ తెలుసుకోండి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఉద్యోగి

మీ పనికి తగిన వేతనం లభించడం లేదని భావిస్తున్నారా? మీలాంటివాళ్లు చాలామంది ఉంటారు.

వేతనాల సగటు పెరుగుతున్నప్పటికీ రోజురోజుకీ అధికమవుతున్న జీవన వ్యయంతో పోల్చినప్పుడు ఈ పెరుగుదల చాలడం లేదు.

ఇటీవల కాలంలో అనేక చోట్ల ఉద్యోగులు సమ్మె చేయడం కనిపించింది. జీతాలు, ఉద్యోగ పరిస్థితులపై వివాదాలు తలెత్తి వేలాదిమంది నిష్క్రమించడం కనిపించింది.

ఇలా సమ్మె చేసినవారిలో చాలామంది ప్రభుత్వ రంగానికి చెందినవారు. ప్రభుత్వ రంగ ఉద్యోగులు వేతనాల విషయంలో వ్యక్తిగత స్థాయిలో సంప్రదింపులు జరిపి జీతాలు పెంచుకునే అవకాశాలు ఉండవు.

పనిచేసేది ప్రభుత్వ రంగంలోనా, ప్రైవేట్ రంగంలోనా అనే సంబంధం లేకుండా మేనేజర్‌తో మాట్లాడినంత మాత్రాన జీతం పెరుగుతుందన్న గ్యారంటీ ఏమీ ఉండదు.

అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే జీతం పెంపు కోసం చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు మెరుగుపడతాయి.

రిక్రూటర్స్, ఒక మేనేజర్, వర్క్‌ప్లేస్ సైకాలజిస్ట్‌తో మాట్లాడి జీతం పెంపు కోరే సమయంలో అనుసరించడానికి కొన్ని టిప్స్ మీకు అందిస్తున్నాం.

సరైన సమయం చూసుకుని

జాబ్స్‌, వేతనాలకు సంబంధించి సమాచారం అందించే 'గ్లాస్ డోర్’ వెబ్‌సైట్‌లో కెరీర్ ట్రెండ్స్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేసే జిల్ కాటన్ దీనిపై బీబీసీతో మాట్లాడారు. వేతనాల పెంచే సమయం దగ్గరపడినప్పుడే కాకుండా ముందే పైఅధికారులు, మేనేజర్లతో మాట్లాడడం వల్ల ఫలితం ఉంటుందన్నారు. అలా చేయడం వల్ల ఒకటికి రెండు సార్లు చెప్పడానిక అవకాశం ఉండడంతో పాటు పైఅధికారులు కూడా సన్నద్ధం కావడానికి అవకాశముంటుందని జిల్ చెప్పారు.

మీరే చొరవ తీసుకుని వేతనం గురించి మాట్లాడాలని స్పష్టంగా చెప్పి భేటీ కావాలంటారు జిల్.

సాలిస్‌బరీలో 'శాఫ్రాన్ ఇండియన్ టేక్‌అవే’ రెస్టారెంట్ నిర్వహిస్తున్న తన సోదరుడికి సహాయంగా ఉంటున్న రౌజొనారా బేగం వేతనాల పెంపుపై మాట్లాడుతూ.. వ్యాపారం బాగా సాగే సమయం చూసి ఉద్యోగి యాజమాన్యాన్ని జీతం పెంచమని అడగాలని అన్నారు.

శాఫ్రాన్ ఇండియన్ టేక్‌అవే రెస్టారెంట్‌లో సాధారణ రోజుల్లో అయిదుగురు పనిచేస్తారు. బిజీ సీజన్లో అదనంగా మరికొందరిని నియమించుకుంటారు.

వ్యాపారం బాగా సాగుతున్న సమయంలో జీతం పెంచమని అడగడం వల్ల ఫలితం ఉంటుందని ఆమె అన్నారు.

ఆధారాలతో అడగండి

జీతం పెంచమని అడిగేటప్పుడు అసలు మీకు ఎందుకు జీతం పెంచాలో వివరించడానికి ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ''మీకు అప్పగించిన పనిలో ఏం సాధించారు, టీమ్‌కి ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు, లైన్ మేనేజర్‌కు ఎలాంటి తోడ్పాటు అందించారు వంటివన్నీ చెప్పాలి. మీ విజయాల లిస్ట్ అంతా చెప్పాలి’ అని గ్లాస్గో కేంద్రంగా పనిచేసే రిక్రూట్‌మెంట్ సంస్థ బ్రైట్ వర్క్ డైరెక్టర్ షాన్ సబా చెప్పారు.

మీ పనికి సంబంధించిన ఆధారాలన్నీ చూడడం వల్ల మీకు జీతం ఎందుకు పెంచాలనేది ఆలోచించే అవకాశం కలుగుతుందని వర్క్‌ప్లేస్ సైకాలజిస్ట్ స్టెఫానీ డేవిస్ అన్నారు.

'ఇంత వేతనం ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న వేసే మెదడుకు సమాధానం ఇవ్వాలి’ అన్నారామె.

చేసిందంతా చెప్పడంతోపాటు ముందుముందు ఏమేం చేయాలనుకుంటున్నారో ఆ ప్రణాళికలు కూడా చెప్పాలని షాన్ సబా సూచించారు.

'సంస్థలో పైకెదగాలన్న ఆకాంక్ష మీకు ఉంటే అందుకుగాను వచ్చే ఏడాది కాలంలో ఏం చేయాలనుకుంటున్నారో ఆ ప్రణాళిక మీ చేతిలో సిద్ధంగా ఉండాలి’ అని సబా అన్నారు.

ఆత్మవిశ్వాసంతో ఉండండి

జీతం పెంచమని అడగిటేప్పుడు మీపై మీరు పూర్తి విశ్వాసంతో ఉండాలని రౌజొనారా బేగం చెప్పారు. జీతం పెంపు విషయంలో సిబ్బందితో మాట్లాడిన అనుభవంతో ఆమె ఈ మాట చెప్పారు.

'ఇక్కడ సాలిస్‌బరీలో మనకు కావాల్సిన సిబ్బంది దోరకడం చాలా కష్టం’ అన్నరామె.

ఇతర దేశాల నుంచి వర్కర్స్‌ను తెచ్చుకోవడం కూడా అంత సులభం కాదు. సిబ్బంది కొరత ఉందని తెలియడం వల్ల వారు జీతాల కోసం పట్టుపడుతుంటారు అన్నారామె.

'మహిళలు, మైనారిటీ నేపథ్యం ఉన్నవారు సాధారణంగా జీతాల కోసం గట్టిగా పట్టుపట్టలేరు’ అని సైకాలజిస్ట్ స్టెఫానీ డేవిస్ అన్నారు.

అలాంటి సమయంలో మార్గనిర్దేశం చేయడానికి ఎవరైనా మెంటార్‌ను ఉపయోగించుకోవాలని స్టెఫానీ సూచిస్తున్నారు.

జీతం పెంపు ఎంత ఉండాలో మనసులో ముందే అనుకోండి

జీతం పెంపు విషయంలో పైఅధికారులతో చర్చించడానికి ముందే పెంపు ఎంత కావాలనుకుంటున్నారో మీకు స్పష్టత ఉండాలి.

జీతం పెంపు కోరేముందు దానికి సంబంధించి తగినంత రీసెర్చ్ చేయాలని రిక్రూట్‌మెంట్ సంస్థ రీడ్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్న జేమ్స్ రీడ్ సూచించారు.

'మీరు చేసే ఉద్యోగానికి ఇతర సంస్థలలో ఎంత జీతం వస్తుందనేది ఆన్‌లైన్ సహాయంతో తెలుసుకోవచ్చు, దాని ప్రాతిపదికన, మీ సామర్థ్యాల ప్రాతిపదికన జీతం ఎంత అడగాలో నిర్ణయించుకోవచ్చు’ అని రీడ్ చెప్పారు.

అయితే, మీరు అడిగే జీతం కానీ, పెంపు కానీ వాస్తవదూరంగా ఉండరాదని జిల్ సూచించారు.

'ఏటా లక్షలులక్షలు జీతం తీసుకోవాలని అందరం కోరుకుంటాం. అదేసమయంలో మనం పనిచేసే ఆ స్థానానికి సంబంధించిన నైపుణ్యాలను బట్టే వేతనాల చెల్లింపు ఉంటుంది’ అన్నారు జిల్.

కెరీర్

ప్రయత్నించడం మానేయొద్దు

'జీతం పెంపు కోసం మీరు చేసే ప్రయత్నాలేవీ ఫలించకపోయినా పట్టు వదిలేయొద్దు. ఒక్కోసారి జీతాల పెంపు చర్చలకు వారాలు, నెలల తరబడి సమయం పట్టొచ్చు. ఆ చర్చలు అలాగే కొనసాగడం ముఖ్యం’ అని రౌజొనారా బేగం చెప్పారు.

ఉద్యోగంలో జీతం ఒక్కటే ముఖ్యం కాదు.. జీతం పెంపు లేకపోతే ఇంకేమీ లేనట్లూ కాదు అని రీడ్ చెప్పారు.

'కొన్నికొన్ని ఉద్యోగాలలో ఎక్కువ సెలవులు ఉండడం, పని వేళల విషయంలో వెసులుబాట్లు వంటివి ఉండొచ్చు’ అని రీడ్ అన్నారు.

అప్పటికీ మీ యాజమాన్యం నుంచి మీకు తగినంత ప్రతిఫలం దక్కడం లేదు అనుకుంటే బయట అవకాశాలను పరిశీలించొచ్చు అని రీడ్ చెప్పారు.

'నిత్యం ఇతర అవకాశాలను చూస్తుండడం అనేది గొప్ప పాఠం’ అని స్టెఫానీ డేవిస్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Know these 5 tips before asking your boss for increase the salary
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X