రేప్ కేసులో బీజేపీ బహిష్కృత నేతకు బెయిల్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నవ్ అత్యాచార కేసులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న ప్రధాన నిందితుడు, బీజేపీ బహిష్కృత నాయకుడు కుల్ దీప్ సింగ్ సెంగర్‌కు బెయిల్ మంజూరయింది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆయన శిక్ష అమలును నిలిపివేసింది కూడా. అప్పీల్ పూర్తయ్యే వరకు జీవిత ఖైదు శిక్షను సస్పెండ్ చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. 15 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, అంతే మొత్తానికి సంబంధించిన మూడు ష్యూరిటీలను సమర్పించాలని బెంచ్ ఆదేశించింది. అప్పీల్ ప్రక్రియ కొనసాగే వరకు శిక్ష నిలుపుదల అమలులో ఉంటుంది. బెయిల్ మంజూరులో కోర్టు కఠినమైన షరతులు విధించింది.

అత్యాచార బాధితురాలు నివసించే ప్రాంతానికి అయిదు కిలోమీటర్ల పరిధిలోకి సెంగార్ వెళ్లకూడదు. బాధితురాలిని గానీ లేదా ఆమె తల్లి గానీ బెదిరించకూడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని ప్రభావితం చేసేలా ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు. ఏదైనా షరతు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ బెయిల్ షరతులతో కూడుకున్నదని, ఏ రక్షణ చర్యలు ఉల్లంఘించినా ఉపసంహరించుకోవచ్చని స్పష్టం చేసింది.
2017లో ఉన్నవ్ లో మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కుల్ దీప్ సింగ్ సెంగర్ దోషి. 2019 డిసెంబర్ లో ట్రయల్ కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విదించింది. తన దోషిత్వాన్ని, జీవిత ఖైదును సవాలు చేస్తూ సెంగార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. తాజాగా తీర్పు ఇచ్చింది. అప్పీల్ పరిష్కారం అయ్యేంత వరకు ఈ శిక్ష నిలుపుదల అమలులో ఉంటుంది.
ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి సీఆర్పీఎఫ్ భద్రతను ఉపసంహరించుకోవడానికి గతంలో సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనికి ఉన్నసున్నితత్వం, బాధితురాలి భద్రతపై ఉన్న ఆందోళనల దృష్ట్యా ఈ అత్యాచార కేసు, దానితో సంబంధం ఉన్న ఇతర పిటీషన్లు, కేసులను 2019 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ నుండి ఢిల్లీకి బదిలీ చేసింది. అత్యాచార దోషిగా తేలడం, బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో సెంగర్ 10 సంవత్సరాల జైలు శిక్షను కూడా అనుభవిస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications