మెడికల్ కాలేజీలో షాకింగ్: రష్యన్ భామలతో బెల్లీ డ్యాన్, అంబులెన్స్‌ల్లో మద్యం బాటిళ్లు

Subscribe to Oneindia Telugu

మీరట్‌: ఉత్తర్‌‌ప్రదేశ్‌ రాష్ట్రం మీరట్‌లోని లాలా లజపతిరాయ్‌ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వికృతానికి దారితీసింది. రోగులను తీసుకొచ్చే వాహనాల్లో మద్యం బాటిళ్లు తీసుకొచ్చారు. అంతేగాక, రష్యన్ డ్యాన్సర్లను తీసుకొచ్చి వారిచే బెల్లీ డ్యాన్సులు చేయిస్తూ వారు చిందులు వేశారు.

ఇప్పుడు మీరట్‌లోని లాలా లజపతిరాయ్‌ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం దేశ వ్యాప్తంగా కలకలంగా మారింది. మద్యాన్ని తరలించడం కోసం అంబులెన్స్‌ను ఉపయోగించడం మేంటని నలువైపుల నుంచి ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి.

మద్యం, మగువలు

మద్యం, మగువలు

ఆ వివరాల్లోకి వెళితే.. లాలాలజపతి రాయ్‌ మెడికల్‌ కాలేజ్‌లో వైద్య విద్యను అభ్యసించిన 1992 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు.. సోమవారం సిల్వర్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఈ క్రమంలో పూర్వ విద్యార్థులు.. సెలబ్రేషన్స్‌ను అట్టహాసంగా నిర్వహించేందుకు మద్యం, మగువలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మద్యాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ వాహనాన్ని వినియోగించారు.

రష్యా నుంచి బెల్లీ డ్యాన్సర్లు

రష్యా నుంచి బెల్లీ డ్యాన్సర్లు

రష్యాను పిలిపించిన బెల్లీ డ్యాన్సర్లతో కలిసి వైద్యులు కూడా చిందులు వేశారు.
ఈ విషయంపై మెడికల్‌ కాలేజ్‌ ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ వినయ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ఈ ఘటన గురించి తనకు అప్పుడే తెలిసిందని చెప్పారు.

మెడికల్ కాలేజీవేనా?

మెడికల్ కాలేజీవేనా?

ఆ కార్యక్రమ నిర్వాహకుల నుంచి సమాధానం రావాల్సి ఉందన్నారు. మద్యం సరఫరాకు వినియోగించిన అంబులెన్సు మెడికల్ కాలేజీకి సంబంధించినదేనా? లేదంటే ప్రైవేటు ఆస్పత్రికి చెందినవా? అన్న విషయంపై స్పష్టత లేదని, ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు.

సమేళనం ఇలానా?

ఈ ఘటనను ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా తీవ్రంగా స్పందించింది. ఇది సరైన పద్ధతి కాదని పేర్కొంది. కాగా, ఈ పార్టీలో పాల్గొన్న వైద్యులపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి చర్యలను ప్రోత్సహించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మీరట్ సీఎంఓ రాజక్ కుమార్ స్పష్టం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking incident, ambulances were used to ferry cartons of liquor while Russian belly dancers were called to entertain guests at the alumni meet of doctors at the state-run Lala Lajpat Rai Medical College held on the college's premises on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి