వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫార్మా కంపెనీలో భారీ పేలుడు: విషవాయువు..జనం పరుగులు: వరుస అగ్ని ప్రమాదాలతో బెంబేలు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర: వేలకొద్దీ నమోదవుతోన్న కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర అతలాకుతులమౌతోంది. ఆసుపత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు బెంబేలెత్తిస్తోన్నాయి. కరోనా సంక్షోభంలో చిక్కుకున్న మహారాష్ట్రలో కొద్దిరోజులుగా 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం నాటి బులెటిన్ ప్రకారం.. 66 వేలకు పైగా కొత్త కేసులక్కడ వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాల మధ్య వరుసగా సంభవిస్తోన్న అగ్నిప్రమాదాలు మరింత గందరగోళానికి చేస్తోన్నాయి.

కరోనా సెకెండ్ వేవ్: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ తీర్పుల వివాదాలు: ఎన్వీ రమణపై ఆశలుకరోనా సెకెండ్ వేవ్: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ తీర్పుల వివాదాలు: ఎన్వీ రమణపై ఆశలు

ఈ తెల్లవారుజామున థానే సమీపంలోని ముంబ్రాలో గల ప్రైమ్ క్రిటికేర్ ఆసుపత్రిలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన ప్రకంపనలు తగ్గకముందే- రత్నగిరి జిల్లాలో అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. రత్నగిరి జిల్లాలోని మహారాష్ట్ర పారిశ్రామికవాడలోని ఓ ఫార్మాసూటికల్స్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Maharashtra: Fire broke out in a MR Pharma, in Ratnagiris MIDC

రత్నగిరి ఎంఐడీసీలో కొన్నేళ్లుగా కొనసాగుతోన్న ఎంఆర్ ఫార్మా కంపెనీలో ఈ ఘటన సంభవించింది. పెద్ద శబ్దం చేస్తూ ఒక్కసారిగా పేలుడు సంభవించంది. రసాయనాలతో కూడుకున్న తెల్లటి దట్టమైన పొగ ఆకాశాన్నంటుకునేంతటి ఎత్తుకు ఎగబాకింది. ఊహించని ఈ పరిణామంతో కంపెనీ కార్మికులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది బయటికి పరుగులు తీశారు. భారీ పేలుడు శబ్దం విని పారిశ్రామికవాడలోని స్థానికులు సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోయారు.

తెల్లటి దట్టమైన పొగ.. అగ్నిపర్వతం పేలుడు తలపించింది. కొన్ని మీటర్ల ఎత్తు వరకూ పొగ విరజిమ్మింది. రసాయనాలతో కూడుకున్న వాయువు కావడంతో ఘాటైన దుర్వాసన విడదలైంది. పలువురు స్థానికుల కళ్లు మంటెక్కాయి.. ఎరుపెక్కాయి. స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి కొంత ఇబ్బంది పడ్డారు. రసాయనాలు కలిసిన గాలిని పిల్చలేక సతమతమయ్యారు. ఈ పేలుడుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది.

Recommended Video

CoWin, Aarogya Setu and Umang app will be open for vaccine registrations | Oneindia Telugu

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. మంటలను ఆర్పివేశారు. దీనికోసం ఎనిమిది అగ్నిమాపక వాహనాలను వారు వినియోగించారు. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ఇప్పటిదాకా ఎవరూ మరణించలేదని తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఎంఆర్ ఫార్మా కంపెనీలో విధి నిర్వహణలో ఉన్న కొందరు ఉద్యోగులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సమగ్ర నివేదికను అంజేయాలని సూచించారు.

English summary
Maharashtra: Fire broke out in a pharmaceutical company, MR Pharma, in Ratnagiri's MIDC. It was later extinguished, no injuries or casualties reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X