మహా రాజకీయాల్లో సంచలనం: ఒక్కటైన థాక్రే సోదరులు
దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. శివసైనికులు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా.. థాక్రే సోదరులు ఎట్టకేలకు ఏకమయ్యారు. మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతూ ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే అధికారికంగా పొత్తును ప్రకటించారు.
బాలాసాహెబ్ సాక్షిగా ఒక్కటైన కుటుంబం
బుధవారం ముంబైలోని వర్లీలో జరిగిన ఉమ్మడి విలేకరుల సమావేశంలో ఈ చారిత్రాత్మక ప్రకటన వెలువడింది. దీనికి ముందు ఉద్ధవ్, రాజ్ థాక్రేలు తమ కుటుంబ సభ్యులతో (రష్మీ థాక్రే, షర్మిల థాక్రే, ఆదిత్య థాక్రే, అమిత్ థాక్రే) కలిసి దాదర్‌లోని శివాజీ పార్కుకు వెళ్లారు. అక్కడ శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్ థాక్రే స్మారకం వద్ద నివాళులర్పించి, ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఒకే కారులో ప్రెస్ కాన్ఫరెన్స్‌కు చేరుకోవడం విశేషం.

ముంబై మేయర్ 'మరాఠీ'నే కావాలి: రాజ్ థాక్రే
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధినేత రాజ్ థాక్రే మాట్లాడుతూ.. శివసేన (UBT), మహారాష్ట్ర నవనిర్మాణ సేన పొత్తును అధికారికంగా ఖరారు చేశారు. వివాదాల కంటే మహారాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. సీట్ల పంపకంపై ఇప్పుడే స్పందించనని చెబుతూ.. "ముంబై మేయర్ పీఠంపై మరాఠీ వ్యక్తే కూర్చుంటారు, అది మా కూటమి నుంచే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేస్తూ.. అభ్యర్థులను దొంగిలించే ముఠాలు తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
ముంబైని ముక్కలు చేయనివ్వం: ఉద్ధవ్ థాక్రే
బీజేపీపై ఉద్ధవ్ థాక్రే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ముంబైని ముక్కలు చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు."మరాఠీ పార్టీలు విడివిడిగా కొట్లాడితే అది అమరవీరులకు అవమానం అవుతుంది. అందుకే మన వారసత్వాన్ని కాపాడుకోవడానికి మేము ఒక్కటయ్యాం" అని ఉద్ధవ్ భావోద్వేగంగా పిలుపునిచ్చారు. ఇప్పుడు ముంబై వైపు కన్నెత్తి చూసే వారి రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనని హెచ్చరించారు.
7 నగరాల్లో పోటీకి సిద్ధం
ఈ రెండు పార్టీలు కలిసి ముంబై, పుణె, నాసిక్ వంటి 7 ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. జనవరి 15న జరగనున్న ఈ ఎన్నికల్లో 'మరాఠీ అస్మిత' వర్సెస్ 'బీజేపీ హిందుత్వ/అభివృద్ధి' మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications