దేశంలోనే అతిపెద్ద బీచ్.. మైమరిపించే దృశ్యాలు.. ఎలా చేరుకోవాలి..?
ఉరుకులు పరుగుల లైఫ్ కు కాస్త బ్రేక్ ఇచ్చి అలా ఆహ్లాదకరమైన వాతావరణంలో విహరించాలని అనుకుంటున్నారా..? సాధారణంగా బీచ్ కు వెళ్లడం అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడతారు. సముద్రతీరంలో సేద తీరడానికి ఆసక్తి చూపిస్తుంటారు. సముద్ర అలలతో ఆటలు ఆడేందుకు మక్కువ చూపిస్తారు. అయితే వారికి చెన్నైలోని మెరీనా బీచ్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఈ బీచ్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. దేశంలోనే పొడవైన, అతిపెద్ద బీచ్ గా గుర్తింపు పొందింది. అంతేకాక ప్రపంచంలోనే రెండో పొడవైన పట్టణ బీచ్ గా నిలిచింది.
తమిళనాడు చెన్నైలోని మెరీనా బీచ్ కు పర్యటకుల తాకిడి పెరిగింది. దేశంలోనే పొడవైన బీచ్ గా గుర్తింపు ఉంది. ఈ బీచ్ ఫోర్ట్ సెయింట్ జార్జి నుంచి బీసెంట్ నగర్ వరకూ సుమారు 13 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లో బీచ్ వెడల్పు రోడ్డు నుంచి సముద్రం వరకూ 437 మీటర్ల వరకు ఉంటుంది. బీచ్ ప్రాతంలో పర్యటకుల కోసం అనేక సదుపాయాలు ఉన్నాయి. కొబ్బరి ఆకులతో పాకలు ఏర్పాటు చేశారు. పిల్లలకు క్రీడా మైదానం, బీచ్ లో ఆటలకు ప్రత్యేకమైన వసతులు కల్పించారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో ఘన వ్యర్ధాల నిర్వహణ, బీచ్ శుభ్రత, పర్యాటకుల భద్రతకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.
అలాగే మెరీనా బీచ్ లో వాక్ వే, సైక్లింగ్ మార్గాలు, ప్లే గ్రౌండ్, వాచ్ టవర్, ఓపెన్ ఎయిర్ జిమ్ నిర్మాణాలు చేపట్టారు. బీచ్ లో పిల్లలకు ఆట సామాగ్రి ఏర్పాటు చేశారు. షెడ్ రూఫ్ లు, లాంగ్ కుర్చీలు, సోఫాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఈ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ పొందడం కోసం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల పనులు వేగవంతం అయ్యాయి. ఇక బీచ్ కు సాయంత్రం సమయంలో పర్యటకులు అధికంగా సందర్శిస్తున్నారు. ఇక్కడి ప్రాంతం సాయంత్రం వేళల్లో జాతరలా ఉంటుంది. ఫుడ్, జ్యువెలరీ, హ్యాండీ క్రాఫ్ట్స్ దుకాణాలు ఏర్పాటు అవుతాయి.

బీచ్ ప్రాంతంలో గాలిపటాలు ఎగురవేయడం, గుర్రపు స్వారీ, బోటింగ్, సూర్యోదయం, సూర్యాస్తమయం వ్యూ పాయింట్ ఇక్కడి ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి. ఇక బీచ్ రోడ్డు మొత్తం తమిళనాడుకు చెందిన మహనీయుల విగ్రహాలు కనువిందు చేస్తాయి. ప్రముఖ నాయకుల స్మారకాలు, పాత బ్రిటిష్ నిర్మాణాలు, కల్చరల్ ఐకాన్ గా నిలుస్తున్నాయి. ఇక నవంబర్- ఫిబ్రవరి సమయంలో మెరీనా బీచ్ సందర్శకులకు బెస్ట్ సీజన్ గా నిలుస్తోంది. అలాగే బస్సు, ట్యాక్సీ, ట్రైన్, ఎయిర్ పోర్టు నుంచి ఈ బీచ్ కు సులభంగా చేరుకోవచ్చు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications