వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కినేని మృతిపై మోడీ: చూడాలని... మురళీమోహన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగు సినీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు మృతి పట్ల గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి బుధవారం తన సంతాపాన్ని తెలిపారు. అక్కినేని భారతీయ సినీ రంగ దిగ్గజం అన్నారు. సినీ పరిశ్రమకు ఆయన ఎనలేని సేవ చేశారన్నారు. భారతీయ సినిమా గొప్ప నటుడిని కోల్పోయిందన్నారు. మోడీ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు.

Modi condoles for Akkinenis death

అక్కినేనిని కలిశా: మనీష్ తివారి

తాను అక్కినేనిని గత ఏడాది జనవరిలో కలిశానని, అది తనకు స్ఫూర్తిదాయక ఎక్స్‌పీరియన్స్ అని కాంగ్రెసు సీనియర్ నేత మనీష్ తివారి అన్నారు. పరిశ్రమకు అతని మృతి చాలా లోటు అన్నారు.

షాక్: మోహన్ బాబు

తాము షాక్‌కు గురయ్యామని మోహన్ బాబు అన్నారు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Akkineni Nageswara Rao was one of Indian cinema's stalwarts, who will be remembered for his rich contribution. Saddened by his demise. RIP.</p>— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/statuses/425871273135071232">January 22, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

దురదృష్టకరం: నవీన్ జిందాల్

అక్కినేని మృతి దురదృష్టకరమని నవీన్ జిందాల్ అన్నారు.

చూడలేకపోయా: మురళీ మోహన్

అక్కినేనిని తాను చివరిసారిగా చూడలేకపోయానని, ఆయనతో మాట్లాడలేకపోయానని నటుడు, టిడిపి నేత మురళీ మోహన్ అన్నారు. అక్కినేనికి అనారోగ్యంగా ఉండటంతో వారం క్రితం కలవాలనుకున్నానని కానీ, కుదరలేదన్నారు. ఈ లోపే ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. కుటుంబ పెద్దను కోల్పోయినట్లుగా ఉందన్నారు. అక్కినేని మృతికి తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి తన సంతాపాన్ని తెలియజేసింది.

English summary
Narenda Modi said Akkineni was one of Indian Cinema's stalwarts, who will be remembered for his rich contibution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X