నమో టీవీపై రాజకీయ దుమారం లైసెన్సు ఇవ్వలేదన్న సమాచార ప్రసార శాఖ
ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు నమోటీవీ పేరుతో కొత్త ఛానల్ ప్రారంభం కావడం రాజకీయ దుమారం రేపింది. ప్రధాని నరేంద్రమోడీ ఫొటోతో లోగో ఉన్న ఛానెల్ బీజేపీ ప్రచారాన్ని ప్రసారం చేస్తుండటంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. లైసెన్సుల సమాచారం, కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోపేరు లేకపోవడం, రేటింగ్ ఏజెన్సీ బార్క్ వద్ద కూడా వివరాలు లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈసీకి లేఖ రాశాయి.
కాంగ్రెస్, ఆప్ ఫిర్యాదు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నమో టీవీపై ప్రత్యేక దృష్టి సారించింది. నమో టీవీకి సంబంధించి పూర్తి వివరాలు కోరుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఎలక్షన్ కమిషన్ లేఖ రాసింది. పనిలో పనిగా నమోటీవీ నుంచి కూడా వివరణ కోరింది.

మరోవైపు మార్చి 31న ప్రధాని నరేంద్రమోడీ మై బీ చౌకీదార్ కార్యక్రమాన్ని గంటకుపైగా ప్రసారం చేసిన దూరదర్శన్ నుంచి ఎన్నికల సంఘం వివరణ కోరింది. ఇదిలా ఉంటే నమో టీవీకి సంబంధించి ఈసీ నోటీసులపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది. నమో టీవీకి ఎలాంటి లైసెన్స్ జారీ చేయలేదని స్పష్టం చేసింది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications