వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘భీమ్’ యాప్ వచ్చేసింది, ఇక అంతా చేతివేళ్లపైనే: మోడీ

మీ వేలి ముద్రలే ఇక మీ బ్యాంకులు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన డీజీ ధన్ మేళాలో పాల్గొన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మీ వేలి ముద్రలే ఇక మీ బ్యాంకులు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన డీజీ ధన్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీజీ ధన్ ప్రధానంగా పేదల కోసమేనని అన్నారు. డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు 'భీమ్' పేరుతో కొత్త యాప్ ప్రారంభించామని తెలిపారు.

భీయ్ యాప్ సామాన్యమైనది కాదని, దేశంలో ప్రత్యేకమైనదని అన్నారు. పేదల జీవితాల బాగుకోసమే డిజిటల్ ఇండియా అని చెప్పారు. అందుకే మహానేత భీమ్ రావ్ అంబేద్కర్ పేరును ఈ యాప్‌కు పెట్టినట్లు తెలిపారు. డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసేందుకు యాప్ ప్రారంభించినట్లు తెలిపారు. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకే లక్కీ డ్రా పథకాలు కూడా తీసుకొచ్చినట్లు తెలిపారు.

50రూపాలయ నుంచి డిజిటల్ లావాదేవీలు జరిపిన వారికి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. వందరోజులపాటు 15వేల మందికి రూ. 10వేల బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ జయంతి రోజున మెగా లక్కీ మొదటి డ్రా తీయనున్నట్లు తెలిపారు.

PM Narendra modi on Friday launched Bhim app for digital transactions.

భవిష్యత్‌లో భీమ్ యాప్ ద్వారానే అన్ని లావాదేవీలు జరుగుతాయని ప్రధాని మోడీ అన్నారు. మీ చేతి వేళ్ల మీదే మీ భవిష్యత్ ఉంటుందని చెప్పారు. బడుగు బలహీన వర్గాల కోసమే డిజిటల్ లావాదేవీలని అన్నారు. ప్రస్తుతం బయటికొచ్చిన సొమ్మంతా ధనికులది కాదని.. పేదలదేనని అన్నారు. ఆదివాసీలకు కూడా డిజిటల్ లావాదేవీలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

నిరాశవాదుల కోసం తన వద్ద ఏమీ లేదని, ఆశవాదుల కోసమే తన ప్రయత్నమని మోడీ అన్నారు. భీమ్ యాప్ కుటుంబ అవసరాలను తీర్చుతుందని అన్నారు. అంతేగాక, డిజిటల్ లావాదేవీలకు భవిష్యత్‌లో ఇంటర్నెట్ కూడా అవసరం లేదని ప్రధాని మోడీ తెలిపారు. ఐదు నిమిషాల్లోనే మీ లావాదేవీలు పూర్తవుతాయని అన్నారు.

మొన్నటి వరకు స్కాంల గురించి మాట్లాడుకునే వారని.. ఇప్పుడు బ్యాంకుల్లో ఎంత జమైందని మాట్లాడుకుంటున్నారంటూ గత యూపీఏ ప్రభుత్వానికి చురకంటించారు.
డిజిటల్ లావాదేవీలతో దేశ స్వరూపం మారిపోతుందని ప్రధాని అన్నారు. సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకోవాలని కూడా తమ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. ప్రజల మంచి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మీడియా కూడా సమర్థించాలని అన్నారు.

2017లో ఏదైనా మొబైల్ చూసిన వారు.. భీమ్ యాప్ ఉందా? లేదా? అని ప్రశ్నించుకుంటారని ఆయన చెప్ాపరు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి దేశ ప్రజలందరూ మద్దతుగా నిలిచారని అన్నారు. 86శాతం నోట్లు రద్దు చేసినా దేశ భవిష్యత్ కోసం ప్రజలందరూ తన నిర్ణయానికి మద్దతుగా నిలవడం గొప్ప విషయమని అన్నారు. ఇదంతా దేశ ప్రజల గొప్పతనమేనని అన్నారు.

తన పిలుపుతో అనేకమంది సంపన్నులు గ్యాస్ సబ్సిడీ వదులుకున్నారని.. దీంతో అంతే మొత్తంలో అదనంగా పేదలకు సబ్సిడీతో గ్యాస్‌ను అందించామని మోడీ చెప్పారు. పేద తల్లికి పొగ బాధ లేకుండా చేశామని చెప్పారు. దేశాన్ని మార్చాల్సిన అవసరం ఉందని, అందకు అందరూ సహకరించాలని ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, ప్రధాని మాట్లాడుతున్నంతసేపు కూడా సమావేశ మందిరం మోడీ నినాదాలతో మారుమోగింది.

English summary
PM Narendra modi on Friday launched Bhim app for digital transactions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X