వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చక్రం తిప్పింది ఎవరు..? సపోర్ట్ చేయడం లేదన్న ఎన్సీపీ, 22 మంది ఎమ్మెల్యేలు అజిత్ వైపే,

|
Google Oneindia TeluguNews

మరాఠా యోధుడు, ఎన్సీపీ చీఫ్.. తలపండిన రాజకీయ నేత శరద్ పవార్ మరోసారి తనదైన రాజకీయ చతురత ప్రదర్శించారు. మహారాష్ట్రలో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడం.. బీజేపీ-శివసేన మధ్య పదవీ పందేరంలో నెలకొన్న అనిశ్చిని క్యాష్ చేసుకున్నారు. శివసేన-కాంగ్రెస్ కూటమికి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించి... చివరికి బీజేపీకి స్నేహహస్తం అందించారు. కానీ దీనిపై స్పష్టత లేదు. శరద్ పవార్ కాక అజిత్ పవార్ మద్దతిచ్చినట్టు తెలుస్తోంది.

మహా ట్విస్ట్ వెనక: మోడీతో శరద్ పవార్ భేటీ కారణమా..? సమీకరణాలు ఎలా మారాయి...?మహా ట్విస్ట్ వెనక: మోడీతో శరద్ పవార్ భేటీ కారణమా..? సమీకరణాలు ఎలా మారాయి...?

బీజేపీకే ఎందుకు..?

బీజేపీకే ఎందుకు..?

ఎన్సీపీ ఆవిర్భావమే.. సోనియాగాంధీని వ్యతిరేకించడం. ప్రధాని పదవీపై కన్నేసిన శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మహారాష్ట్రలో అధికారం చేపట్టే సీట్లు సాధించకున్న కింగ్ మేకర్‌గా అవతరించింది. పార్టీ ఆవిర్భావం నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన.. ఆ పార్టీతో సఖ్యంగానే మెలుగుతున్నారు. యూపీఏ భాగస్వామ్య పక్షంలో ఉన్నారు.

కాంగ్రెస్‌ను కాదని..

కాంగ్రెస్‌ను కాదని..

కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో.. యూపీఏ తన ప్రభను కోల్పోతుంది. 2014లో కన్నా పదేసి సీట్లు గెలుచుకున్నది. దీంతో కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కానీ మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య దూరం పెరగడాన్ని శరద్ పవార్ సరిగ్గా ఉపయోగించుకున్నారు. శివసేన నేతలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని ముందుకొస్తే.. అంగీకరించారు. అయితే కాంగ్రెస్, ఎన్సీపీకి శివసేన అంటే సిద్ధాంతపరంగా నచ్చదు. పైకి మాత్రం ఓకే అని చెప్పి తెరచాటు రాజకీయాలు చేశారు.

బీజేపీతో మైత్రి

బీజేపీతో మైత్రి

శివసేన అంటే నచ్చని పవార్.. ఇటీవల ఢిల్లీలో మోడీతో సమావేశమయ్యారు. తమ దృష్టిలో శివసేన, బీజేపీ రెండు ఒక్కటేనని పవార్ భావన. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీకి మద్దతిస్తే నిధులు, ప్రాజెక్టుల విషయంలో మేలు జరుగుతుందని భావించారు. రైతు ప్రయోజనాల కోసం పాడుపడొచ్చని భావించారు. అందుకే బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

 చాణక్యం.. కానీ

చాణక్యం.. కానీ

కానీ పవార్ రాజకీయ చాణక్యంతో శివసేనకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంకయిపోయింది. తమకు మద్దతు తెలిపి.. చివరి క్షణంలో ఇలా చేశారేంటి అని నోరెళ్లబెడుతున్నారు. పదవుల పంపకంపై చర్చించినా.. ఎందుకీలా చేసిందో అర్థంకావడం లేదు. మొత్తానికి శరద్ పవార్ తనదైన రాజకీయ చాణక్యంతో శివసేనకు చుక్కలు చూపించారు. కానీ తాము బీజేపీకి సపోర్ట్ చేయడం లేదని ఎన్సీపీ తేల్చిచెప్పింది. దీంతో శరద్ పవార్ కాక మరేవరు మద్దతిస్తున్నారో అర్థం కావడం లేదు. అజిత్ పవార్ పేరు తెరపైకి వచ్చింది.

Recommended Video

Devendra Fadnavis Takes Oath As Maharashtra CM || డిప్యూటీగా అజిత్ పవార్
సీనియర్ కాదా..

సీనియర్ కాదా..

అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు చేశారా అనే చర్చ జరుగుతుంది. అజిత్‌కు 22 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు, కొందరు శివసేన ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి 40 సీట్ల దూరంలో నిలిచిపోయింది. అంటే 40 మందిని అజిత్ పవార్ సమకూర్చాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

English summary
maha twist behind: who is support to bjp government. sharad pawer or ajith pawar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X