వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓడించే శక్తి తేజస్వి కూటమికి లేదు ,ఒకవేళ అది జరిగితే కరోనా వల్లే .. జేడీయూ నేత త్యాగి

|
Google Oneindia TeluguNews

బీహార్‌లో ఓట్లు లెక్కింపు ప్రారంభం కాగానే, తేజశ్వి యాదవ్ నేతృత్వంలోని మహా కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ను వెనక్కి నెట్టడంతో నితీష్ కుమార్ పార్టీ ఓటమిని ఆదిలోనే అంగీకరించినట్టు అయింది. కౌంటింగ్ ప్రారంభంలోనే ట్రెండ్ ను అర్థం చేసుకున్న జెడియు ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొంది. ఒకవేళ తాము ఓడిపోతే మమ్మల్ని ఆర్జెడి లేదా తేజశ్వి యాదవ్ ఓడించలేరని , కానీ దేశానికి శాపంగా మారిన కరోనా కారణంగానే అని జనతాదళ్ యునైటెడ్ ప్రతినిధి కెసి త్యాగి చెప్పడం గమనార్హం.

బీహార్ లో యూఎస్ తీర్పు రిపీట్ ..ఇక్కడ నమస్తే ట్రంప్ అంటే అక్కడ బైబై ట్రంప్ అన్నారు : శివసేనబీహార్ లో యూఎస్ తీర్పు రిపీట్ ..ఇక్కడ నమస్తే ట్రంప్ అంటే అక్కడ బైబై ట్రంప్ అన్నారు : శివసేన

ఇదంతా కోవిడ్ ఎఫెక్ట్ ... జేడీయూ కాదు ఎన్డీయే కూటమి వెనుకబడింది

ఇదంతా కోవిడ్ ఎఫెక్ట్ ... జేడీయూ కాదు ఎన్డీయే కూటమి వెనుకబడింది

బీహార్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతున్న వేళ జెడియు ప్రతినిధి త్యాగి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . "మేము కోవిడ్ కారణంగా మాత్రమే వెనుకబడి ఉన్నామన్నారు . బీహార్లో గత 70 సంవత్సరాల క్షీణతను కరోనా కారణంగా చూశామని, దానికి ప్రతిఫలమే చెల్లిస్తున్నామని జనతాదళ్ యునైటెడ్ సీనియర్ నాయకుడు చెప్పారు.బిజెపితో కలిసి వెళ్లడంతో బిజెపి ఫలితాలు మా కంటే ప్రతికూలంగా కనిపిస్తున్నాయని, నితీష్ కుమార్ జెడియు కంటే ఫలితాలలో బీజేపీ చాలా వెనక పడిందని, ఎన్డీఏ కూటమి మొత్తంగా వెనుకబడిన ట్లు కనిపిస్తుందని అన్నారు.

 బీహార్ ప్రజలు వద్దనుకుంటే గద్దె దించేది ప్రకృతి మాత్రమే

బీహార్ ప్రజలు వద్దనుకుంటే గద్దె దించేది ప్రకృతి మాత్రమే

అయినప్పటికీ ప్రత్యర్థి కూటమికి దగ్గరగానే యుద్ధం జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు త్యాగి. గతంలో జరిగిన ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం 40 స్థానాలను కైవసం చేసుకోగా, తేజశ్వి యాదవ్ కూటమి పెద్దగా ఫలితాలు సాధించలేక పోయిందని మిస్టర్ త్యాగి అభిప్రాయపడ్డారు.గత సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో పెద్ద వీరోచితంగా ఆర్జెడి పోరాడింది ఏమీ లేదు ..ఆర్జెడి సాధించిన భారీ విజయాలు ఏవీ లేవు. కాబట్టి మమ్మల్ని ఒకవేళ బీహార్ ప్రజలు వద్దనుకుంటే గద్దె దించేది ప్రకృతి మాత్రమే" అని త్యాగి అభిప్రాయపడ్డారు.

చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీతో భారీగా చీలిన ఓటు బ్యాంకు ?

చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీతో భారీగా చీలిన ఓటు బ్యాంకు ?

నితీష్ కుమార్ ఈసారి అధికారంలోకి రావాలని సాగించిన ఎన్నికల ప్రచారంలో కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఇన్నేళ్లు పాలన సాగించిన నితీష్ కుమార్ ఉద్యోగాలు, కరోనావైరస్ నిర్వహణ మరియు వలసదారుల సంక్షోభం విషయంలో ఫెయిల్ అయ్యారని ప్రత్యర్థి పార్టీలు జోరుగానే ప్రచారం చేశాయి. ఇదే సమయంలో వరదలపై ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నట్లు కనిపించింది.ఎన్నికలకు ముందే విడిపోయి, జెడియుకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టిన ఎన్డిఎ మిత్రుడు చిరాగ్ పాస్వాన్, నితీష్ కుమార్ కు భారీగా నష్టం చేయొచ్చని అంచనా ఉంది.

Recommended Video

Bihar polls: Counting of votes begins for 243 Assembly constituencies
చిరాగ్ ను కంట్రోల్ చేయలేకపోయారని బీజేపీపై నర్మగర్భ వ్యాఖ్యలు

చిరాగ్ ను కంట్రోల్ చేయలేకపోయారని బీజేపీపై నర్మగర్భ వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విధేయత ప్రకటించిన చిరాగ్ పాస్వాన్ నితీష్ కుమార్ పై దాడి చేస్తూనే ఉన్నారు . బిజెపి , జెడియుతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
బిజెపి నాయకత్వం చిరాగ్ పాశ్వాన్ విషయంలో సైలెంట్ గా ఉంది. అతడిని ఖండించడానికి లేదా, ఆయన పార్టీని దూరం చేసుకోవడానికి సుముఖత చూపలేదు, ఇది నితీష్ కుమార్ లేకుండా ప్లాన్ బి ని ఉంచుతోందనే అభిప్రాయాన్ని కూడా బలపరిచింది. ఇప్పుడైనా చిరాగ్ పాశ్వాన్ ను బహిరంగంగా నిలదీయాలి అంటూ త్యాగి పేర్కొనడం ఎల్జేపీని కట్టడి చెయ్యలేకపోయిన బిజెపి పట్ల జేడీయూ నేత అసహనాన్ని స్పష్టం చేస్తుంది.

English summary
As votes were counted in Bihar, Nitish Kumar's party conceded defeat early as the ruling National Democratic Alliance (NDA) trailed the opposition alliance led by Tejashwi Yadav."We welcome the people's decision. We were not defeated by RJD or Tejashwi Yadav but nation's curse (Covid)," said Janata Dal United spokesperson KC Tyagi said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X