ఎటిఎం లనుండి నగదు ఉపసంహరణపై ఆంక్షల ఎత్తివేత దిశగా కేంద్రం సంకేతాలు
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఎటిఎంల నుండి నగదు ఉప సంహరణ పై ఉన్న ఆంక్షలను కేంద్రం ఎత్తివేసే దిశగా సంకేతాలను పంపుతోంది. పెద్ద నగదు నోట్ల రద్దు వల్ల ప్రతి రోజు ఎటిఎం ల నుండి 2,500 రూపాయాలను డ్రా చేసుక
న్యూఢిల్లీ : పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, ఎటిఎం ల నుండి నగదు ఉప సంహరణపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.అయితే ఎటిఎం లనుండి నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. డిసెంబర్ చివరి వారం తర్వాత ఆ ఆంక్షలు ఎత్తివేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది.
ఎటిఎం ల ద్వారా ప్రస్తుతం రెండున్నరవేల రూపాయాలను డ్రా చేసుకొనే అవకాశం ఉంది.బ్యాంకుల ద్వారా అయితే ప్రతివారానికి కనీసం 24 వేల రూపాయాలను ఉపసంహరణ చేసుకొనే అవకాశం ఉంది.

అయితే పెద్ద నగదు నోట్ల రద్దు డిపాజిట్లు చేసుకొనేందుకుగాను ఈ నెల 30వ, తేదితో గడువు ముగిసి పోతోంది. అయితే ఈ గడువు ముగిసిన తర్వాత ఎటిఎంల నుండి డబ్బులను డ్రా చేసుకోవడంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
డిసెంబర్ 30వ, తేది తర్వాత ఎటిఎంల నుండి ప్రస్తుతం ఉన్న నగదు ఉప సంహరణపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసేందుకు కేంద్రం చర్యలు తీసుకొంటుంది. అయితే పెద్ద నగదును రద్దు చేసేనాటికి ప్రతి ఎటిఎం నుండి ఒక్క రోజులో సుమారు 40 వేల రూపాయాలను ఉపసంహరణ చేసుకొనే అవకాశం ఉంది.అయితే కేంద్రం పాత పద్దతిని కొనసాగిస్తోందా లేదా ప్రస్తుతం ఉన్న రెండున్నర వేల రూపాయాల నగదు పరిమితిని ఇంకా పెంచుతారనే అనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.












Click it and Unblock the Notifications