వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాన్ కార్డులో తండ్రి పేరు అవసరం లేదా..! రూల్స్ సడలించిన సీబీడీటీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : పర్మనెంట్ అకౌంట్ నంబర్ - పాన్ కార్డులో తండ్రి పేరు తప్పనిసరిగా పేర్కొవాలనే నిబంధన ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో తండ్రి పేరు రాయాల్సిన అవసరం లేదంటూ సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి) అధికారులు పేర్కొన్నారు. ఈమేరకు నిబంధనలు సడలిస్తూ మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే తల్లి మాత్రమే ఉండి తండ్రి లేనివారికి మాత్రమే ఈ నయా రూల్ వర్తిస్తుంది.

తండ్రి చనిపోయిన పక్షంలో లేదంటే తమను తండ్రి వదిలిపెట్టి వెళ్లిపోయిన వారికి మాత్రమే ఈ నిబంధనను సడలించారు. వీరు కచ్చితంగా తండ్రి పేరును అప్లికేషన్ లో నింపాల్సిన అవసరముండదు. డిసెంబర్ 5 నుంచి కొత్తగా మార్చిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

no need to fill father name in PAN

ఫైనాన్సియల్ ఇయర్ లో రెండున్నర లక్షల రూపాయలకు మించి ట్రాన్సక్షన్స్ జరిపే సంస్థలు, కంపెనీలు ఇకపై కచ్చితంగా పాన్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకోవాలని తెలిపింది. మే 31 వరకు గడువు ఇస్తూ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.

English summary
CBDT has changed some rules that no need to fill father name in PAN card.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X