వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం నిధులు తీసుకోం.. మెట్టు దిగని దీదీ.. కొనసాగుతున్న దీక్ష

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రగడ దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్న అక్కడి సీఎం మమతా బెనర్జీ మెట్టు దిగడంలేదు. కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ దీదీ చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. మరోవైపు వివిధ పథకాల కింద కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకోబోమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోడీపై ఆరోపణలు గుప్పించిన మమతా.. రైతుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన మధ్యంతర బడ్జెట్ ను అంకెల గారడీగా అభివర్ణించారు.

 కొనసాగుతున్న దీక్ష.. అక్కడే అధికారిక విధులు

కొనసాగుతున్న దీక్ష.. అక్కడే అధికారిక విధులు

చిట్‌ఫండ్ కుంభకోణంలో కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు రావడంతో దుమారం రేగింది. కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో చేపట్టిన దీక్ష ఇంకా కొనసాగుతోంది.
సోమవారం నాడు ధర్నా ప్రదేశం నుంచే అధికారిక విధులు నిర్వర్తించారు దీదీ. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గ సమావేశం కూడా అక్కడే కొనసాగించారు.

రాష్ట్రాలపై కేంద్రం ఆజమాయిషీ కరెక్ట్ కాదంటూ గుర్రుగా ఉన్న మమతా.. దేశానికి, రాజ్యాంగానికి రక్షణ కల్పించేంతవరకు దీక్ష కొనసాగిస్తానంటూ శపథం చేశారు. అయితే విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం (8వ తేదీ) వరకు మాత్రమే ధర్నా చేయాలని డిసైడయ్యారు. అదలావుంటే మోడీ వర్సెస్ దీదీ తీరుగా సాగుతున్న ఈ ఏపిసోడ్ కు కేంద్రబిందువుగా మారిన సీపీ రాజీవ్ కుమార్ దీక్షా ప్రదేశంలో ఉండటం చర్చానీయాంశమైంది.

కొనసాగుతున్న దీదీ దీక్ష.. ఫుల్ సపోర్ట్.. నిరసనలకు తృణమూల్ రెడీ

కేంద్రం నజర్..!

కేంద్రం నజర్..!

దీదీ దీక్షకు మద్దతుగా తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు మమతా బెనర్జీ. కొన్నిచోట్ల రైళ్లను అడ్డుకున్నారనే సమాచారం మేరకు ఈ సూచన చేశారు.

పశ్చిమ బెంగాల్ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తోంది కేంద్ర హోంశాఖ. ఆదివారం బెంగాల్ లో చోటుచేసుకున్న పరిణామాల్లో ఐపీఎస్ అధికారులు ఎవరైనా నిబంధనలు అతిక్రమించారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీని నివేదిక ఇవ్వాలని కోరారు సెంట్రల్ హోం మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్. ఆ మేరకు రాజ్ భవన్ అధికారులు వెంటనే కేంద్రానికి నివేదిక పంపించారు. అయితే అందులో ఏముందనే విషయం బయటకు రాలేదు.

ఏకతాటిపైకి విపక్షాలు.. దీదీకి మద్దతు

ఏకతాటిపైకి విపక్షాలు.. దీదీకి మద్దతు


కేంద్రానికి వ్యతిరేకంగా రాజకీయేతర ధర్నా చేస్తున్నానంటూ వ్యాఖ్యానించారు మమతా బెనర్జీ. తాను చేస్తున్నది పొలిటికల్ ప్రోగ్రామ్ కాదని.. అన్నీ రాజకీయ పార్టీలు నిరసనలో పాల్గొనవచ్చని సూచించారు. ఇప్పటికే పలు పార్టీలు దీదీకి మద్దతుగా నిలిచాయి. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్ తదితర నేతలు మమతకు మద్దతు ప్రకటించారు.

కేంద్రం వైఖరి చూస్తుంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నారు మాజీ ప్రధాని దేవెగౌడ. ప్రతిపక్షాలను దెబ్బ కొట్టి నియంత పాలనకు తెర తీసేలా కేంద్రం సీబీఐని వాడుకుంటోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే. ఇన్నాళ్లుగా యూపీఏ, ఎన్డీయే పక్షాలకు సమదూరంలో ఉంటూ వచ్చిన బీజేడీ పార్టీతో పాటు అనేక విపక్ష పార్టీలు దీదీకి మద్దతుగా నిలుస్తున్నాయి.

English summary
West Bengal issue is a nationwide debate. Mamata Banerjee, who is accused of allegations of the Center, has not stepped down. protest continues to indulge in the attitude of the Center. On the other hand, she told that funds from the center will not be taken under various schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X