పాకిస్థాన్ ను మరింత నష్ట పరిచేందుకు రెడీ: BSF
ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. వందలాది మంది ఉగ్రమూకలను ధ్వంసం చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ సరిహద్దు గుండా ఉన్న దాదాపు 60కు పైగా టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్స్ పాకిస్థాన్ అంతర్గత భూభాగంలోకి షిఫ్ట్ అయినట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) స్పష్టం చేసింది. మరో 12 లాంచ్ ప్యాడ్స్ సియాల్ కోట్, జఫ్ఫార్ వాల్ ప్రాంతం నుంచి పనిచేస్తున్నట్లు పేర్కొంది. అవి సరిహద్దుకు కొంచెం దూరంలోనే ఉన్నట్లు BSF డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ విక్రమ్ కుమార్ తెలిపారు.
పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ధాటికి పాకిస్థాన్ తోక ముడిచినట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) స్పష్టం చేసింది. పాకిస్థాన్ బోర్డర్ వద్ద నుంచి దాదాపు 60 టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్స్ పాకిస్థాన్ లోని అంతర్గత ప్రాంతాలకు షిఫ్ట్ అయినట్లు BSF తెలిపింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో బోర్డర్ లో ఉన్న అనేక టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ను ధ్వంసం చేసినట్లు BSF డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ విక్రమ్ కుమార్ తెలిపారు. BSF ధాటికి పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఫెసిలిటీస్ ను డెప్త్ ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. మరో 12 లాంచ్ ప్యాడ్స్ సియాల్ కోట్ అండ్ జఫ్పార్ వాల్ లోని లోతైన ప్రాంతాల నుంచి వర్కింగ్ లో ఉన్నట్లు విక్రమ్ కుమార్ వివరించారు. టెర్రరిస్టు ప్రాంతాలు, లాంచ్ ప్యాడ్స్ ఇలా ఎప్పటికప్పుడు మారుస్తున్నట్లు గుర్తించినట్లు స్పష్టం చేశారు.
BSF ఇన్ స్పెక్టర్ జనరల్, జమ్ము ఫ్రంటియార్, శశాంక్ ఆనంద్, డీఐజీ కుల్వంత్ రాయ్ శర్మ తో కలిసి ఏర్పాటు చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ లో BSF డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ విక్రమ్ కుమార్ ఈ కీలక విషయాలు వెల్లడించారు. అయితే మరోసారి క్రాస్- బోర్డర్ ఆపరేషన్ కు సిద్ధమేనని తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే శత్రు దేశానికి మరింత నష్టం చేకూరుస్తామని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లో జరిగిన నష్టం కంటే పాకిస్థాన్ కు మరింత నష్టం కలిగించే సామర్థ్యం BSF కు ఉందని ఇన్ స్పెక్టర్ జనరల్ విక్రమ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పాలసీ తీసుకున్నా దాన్ని అమలు పరిచేందుకు BSF సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఇక జమ్మూకాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాల్లోని పహల్గామ్ వ్యాలీలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే 7-10 వరకు జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 9 కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రమూకలను ఏరిపారేసింది భారత సైన్యం.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications