వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల స్ట్రాటజిస్ట్ నుంచి జేడీయూ వరకు: ప్రశాంత్ కిషోర్ కెరీర్ విషయాలు

|
Google Oneindia TeluguNews

2019 ఎన్నికలకు ఏ పార్టీ కోసం పనిచేయనని ఇప్పటికే స్పష్టత ఇచ్చారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. అదే సమయంలో ఇక ప్రజాసేవకే అంకితమవుతానని కూడా చెప్పారు. చెప్పింది చెప్పినట్లుగానే ప్రశాంత్ కిషోర్ చేస్తున్నారు. అయితే ప్రజలకు సేవ చేసేందుకు ఒంటరిగా కాదు..ఒక పార్టీ తీర్థం పుచ్చుకుని మరీ సేవ చేసేందుకు ఈ ఎన్నికల వ్యూహకర్త రంగం సిద్ధం చేసుకున్నారు. అవును ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

జేడీయూ తీర్థం పుచ్చుకున్న ప్రశాంత్ కిషోర్

జేడీయూ తీర్థం పుచ్చుకున్న ప్రశాంత్ కిషోర్

తాజాగా ప్రశాంత్ కిషోర్ బీహార్ సీఎం నితీష్‌కుమార్ సమక్షంలో జనతాదల్ యునైటెడ్ పార్టీలో చేరారు. నితీష్‌కుమార్ ప్రశాంత్ కుమార్ పార్టీలో చేరడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తెలుపుతూ ప్రశాంత్ కిషోర్ తన ట్విటర్‌పై పోస్టు చేశారు. తన నూతన ప్రయాణాన్ని బీహార్ నుంచి ప్రారంభించిడం సంతోషానిస్తోందంటూ ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ తాను స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి పనిచేస్తున్నారు. తాను పొలిటికల్ యాక్షన్ కమిటీకి దూరమైనప్పటికీ ఆ సంస్థ మాత్రం పనిచేస్తుందంటూ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు ప్రశాంత్ కిషోర్.

ఐక్యరాజ్య సమితి నుంచి ప్రధాని మోడీ, నితీష్,జగన్ టీమ్ వరకు..

ప్రశాంత్ కిషోర్ తన కెరీర్‌ను ఐక్యరాజ్యసమితిలో ప్రజాఆరోగ్య వ్యవస్థ నిపుణిడిగా ప్రారంభించారు.2014 సాధారణ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత బీహార్‌లో మహాఘట్భంధన్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్. 2015లో ఆనాడు నితీష్ ప్రభుత్వం ఓటమిపాలవుతుందని అంతా అనుకుంటున్న సమయంలో అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి తిరిగి నితీష్ కుమార్ సీఎం అవ్వడంలో కీలక పాత్ర పోషించారు.

2019 ఎన్నికల్లో ఏ పార్టీకి పనిచేయను: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్2019 ఎన్నికల్లో ఏ పార్టీకి పనిచేయను: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

ప్రశాంత్ కిషోర్ రాకతో నితీష్‌కు కొండంత బలం

ప్రశాంత్ కిషోర్ రాకతో నితీష్‌కు కొండంత బలం

ఇదిలా ఉంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో విఫలమయ్యారు. అంతేకాదు చివరినిమిషంలో సమాజ్‌వాదీ పార్టీలో తండ్రి ములాయంసింగ్ యాదవ్, కొడుకు అఖిలేష్ యాదవ్‌ల మధ్య చీలిక రావడంతో వారి విజయం సాధ్యంకాలేదు. ఇక గత రెండేళ్లుగా ప్రశాంత్ కిషోర్ ఏపీలోని వైసీపీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఇక జేడీయూలోకి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇవ్వడంతో సీఎం నితీష్ కుమార్‌కు కొండంత బలం వచ్చినట్లు అయ్యింది. అది కూడా 2019 సాధారణ ఎన్నికలకు ముందు ప్రశాంత్ చేరడంపై నితీష్ ఆనందం వ్యక్తంచేశారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరడంతో నితీష్ కుమార్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల బేరంపై గట్టిగా బీజేపీతో మాట్లాడే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.

ప్రశాంత్ కిషోర్ స్కెచ్ వేస్తే పార్టీ గెలవాల్సిందే..!

ప్రశాంత్ కిషోర్ స్కెచ్ వేస్తే పార్టీ గెలవాల్సిందే..!

ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ స్కెచ్ వేస్తే ఆ పార్టీ విజయాన్ని రుచిచూడాల్సిందే. అంతలా ఆయనకు పేరుంది. 2014లో మోడీ ప్రధానిగా అయ్యారంటే... ఆ తర్వాత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆనాడు ఎన్డీఏని మట్టికరిపించి ప్రభుత్వం చేపట్టినా దీని వెనక ఉన్న మాస్టర్ మైండ్ ప్రశాంత్ కిషోర్. అయితే 2019 తర్వాత కేవలం ప్రజాసేవకే అంకితమవుతానని గత ఆదివారం ప్రశాంత్ కిషోర్ విద్యార్థులతో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో చెప్పారు. మొత్తానికి జేడీయూలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పొలిటికల్ గురు ఆ రాష్ట్రంలో ఎలాంటి అద్భుతాలు చేస్తారో చూడాలి...

English summary
Political strategist Prashant Kishor, who is credited with delivering election victories for Prime Minister Narendra Modi and Bihar Chief Minister Nitish Kumar, took the political plunge on Sunday with the latter’s Janata Dal (United).Kishor, who is also the founder of Indian Political Action Committee (I-PAC), joined the JD(U) in the presence of Nitish Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X