ప్రచారం ఆపేస్తా... ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన
భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇచ్చిన వాగ్దానాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మహాగఠ్ బంధన్ ప్రభుత్వం రాబోయే రెండు సంవత్సరాల్లో 5 లక్షల నుంచి 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే తాను ప్రచారం ఆపేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ''జన్ సురాజ్ అభియాన్'' ను ఉపసంహరించుకొని నితీష్ కు తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానన్నారు.

యాత్రను ఉపసంహరించుకుంటా
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తేజస్వీ యాదవ్ లాంటి యువతరం నేతల సహకారంతో ఉద్యోగాల కల్పనకు కృషిచేస్తున్నట్లు నితీష్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపైనే పీకే తాజాగా స్పందించారు. ఆ ఉద్యోగాలు కనుక కల్పిస్తే తన యాత్రను ఉపసంహరించుకుంటానని, సర్కారుకు మద్దతు ప్రకటిస్తానని తెలిపారు.

2నితీష్ కుమార్ ఫెవికాల్ వేసుకొని అతుక్కుపోయారు
బీహార్ రాజకీయాల్లోకి వచ్చి తాను కేవలం మూడునెలలే అవుతోందని, కానీ స్వల్పకాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు జరిగాయన్నారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని సంచలనాలు జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై పీకే వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఇతర పార్టీలన్నీ ప్రయాసపడుతోంటే నితీష్ కుమార్ మాత్రం ఫెవికాల్ వేసుకొని మరీ ముఖ్యమంత్రి కుర్చీకి అతుక్కుని కూర్చున్నారని ఎద్దేవా చేశారు.

అక్టోబరు 2 నుంచి పాదయాత్ర
పీకే గతంలో జేడీయూలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. కొన్ని కారణాలవల్ల పార్టీ ఆయనపై వేటు వేసింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో పీకే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్ కూడా ఆయనకు స్వాగతం పలికింది. కానీ ఆ ఆహ్వానాన్ని పీకే తిరస్కరించారు. బీహార్ రాజకీయాలపై దృష్టిసారించి ''జన్ సురాజ్ అభియాన్'' పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబరు 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాపత్ంగా 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications