ఆ ఒక్క కారణం: డేరా బాబా 'సెక్స్' ఆకృత్యాల నుంచి ఎస్కేప్, అమ్మాయిల ప్లాన్!

Subscribe to Oneindia Telugu
  పీరియడ్స్(రుతుస్రావం)లో ఉన్నామని చెప్పి డేరా బాబా 'సెక్స్' ఆకృత్యాల నుంచి ఎస్కేప్ | Oneindia Telugu

  చంఢీగఢ్: మహిళలపై ఆక్రుత్యాలకు తన ఆశ్రమాన్ని అడ్డాగా మార్చుకున్న గుర్మీత్ బాబా.. విచ్చలవిడి శృంగారంతో ఎంతోమందిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సెక్స్ అతనికో వ్యసనం. ఆశ్రమంలో అందమైన అమ్మాయిలను వెతికి మరీ ప్రతీరోజు తన 'గుఫా'కు రప్పించుకునేవాడు.

  విష కన్యలు అనే టీమ్ ను ఇందుకోసం ప్రత్యేకంగా నియమించుకున్నాడు. ఆశ్రమంలోని అందమైన అమ్మాయిలను వెతికి పట్టుకొచ్చి గుఫాలోకి పంపించడం వీరి పని. నయానో.. భయానో.. అమ్మాయిలను వీరు బాబా గదిలోకి పంపించేవారు.

  'సెక్స్' లేక జైల్లో ఇలా!: డేరా బాబాకు అదంటే విపరీతమైన పిచ్చి, ఆస్ట్రేలియా నుంచి ఔషధాలు

  అలా ఏళ్ల తరబడి గుర్మీత్ బాబా తన శృంగార కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. అతని మాటకు ఎదురుచెప్పినా.. అతని కోరిక తీర్చకపోయినా.. వారు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ప్రాణాలు కోల్పోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు.

  Pretending herself to be bleeding, girl escapes from being molested by Ram Rahim...

  బాబా కన్ను పడ్డ తర్వాత ఆయన నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఆశ్రమంలో ఎక్కుడున్నా వెతికి పట్టుకొస్తారు. అయితే కొంతమంది అమ్మాయిలు మాత్రం తెలివిగా ఆయన నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తాము పీరియడ్స్(రుతుస్రావం)లో ఉన్నామని చెప్పి బాబాను వారు దూరం పెట్టేవారని తెలుస్తోంది.

  తాజాగా ఆశ్రమానికి చెందిన ఓ మహిళ ఈ విషయాలను బయపెట్టింది. 'గుఫా'కి రావాలంటూ అప్పట్లో ఒకసారి తనకు పిలుపు వచ్చిందని, గదిలోకి వెళ్లాక ఆయన చేసే పనేంటన్నది అర్థమైందని తెలిపింది. మంచంపై కూర్చొని బాబా పోర్న్ చూస్తున్నాడని పేర్కొంది. పక్కన కూర్చోవాలని తనను ఆదేశించాడని, అయితే తాను మాత్రం పీరియడ్స్ లో ఉన్నానని చెప్పి తప్పించుకున్నానని చెప్పుకొచ్చింది.

  ఇలాంటి సమయంలో మీకు ఎదురుగా రాలేనని చెప్పి తప్పించుకున్నట్లు తెలిపింది. తనలాగే చాలామంది అమ్మాయిలు ఇదే మాట చెప్పి బాబా నుంచి తప్పించుకునేవారని చెప్పింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Latest reports on ‘Ram Rahim leela’ reveals that his women followers used to escape from the hands of self styled godman by making period excuses.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి