వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగర్ సిద్దూ హత్య ఎఫెక్ట్: తిరిగి 420 మందికి భద్రత.. ఎప్పటి నుంచి అంటే.

|
Google Oneindia TeluguNews

ఇటీవల పంజాబ్‌లో సింగర్ సిద్దూపై విచక్షణ రహితంగా కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. దాంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపే ఒకరోజు ముందు సిద్దూ సహా 420 మందికి పంజాబ్ ప్రభుత్వం భద్రతను వెనక్కి తీసుకుంది. దీంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో పంజాబ్ ప్రభుత్వం తలొగ్గింది. వెనక్కి తీసుకున్న భద్రతను.. తిరిగి కల్పించింది. ఆ ప్రముఖులకు ఈ నెల 7వ తేదీ నుంచి సెక్యూరిటీ ఇస్తామని తెలిపింది.

భద్రత కోల్పోయిన వారిలో ఒకరు మాజీ మంత్రి ఓపీ సోని పంజాబ్ హర్యానా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని ధర్మాసనం విచారించింది. భద్రతను ఎందుకు తొలగించారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితూ జూన్ 6వ తేదీన జరిగే ఆపరేషన్ బ్లూస్టార్ వార్షికోత్సవానికి భద్రతా సిబ్బంది అవసరం అని ప్రభుత్వం తెలిపింది. 1984లో స్వర్ణ దేవాలయంలో నక్కిన ఉగ్రవాదులను అంతం చేయడానికి ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Punjab To Restore Security Of 420 VVIPs

ఆప్ అధినేత అరవింద కేజ్రీవాల్.. అవినీతి వ్యతిరేఖ పార్టీని చెప్పుకుంటారు. వీఐపీ సంస్కృతిని అంతం చేయాలని అనుకుంటారు. అందుకే భద్రత తగ్గించారా అనే సందేహాం కలుగుతుంది. కానీ హైకోర్టుకు పిల్ చేరడంతో పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత తిరిగి భద్రత కల్పిస్తామని పంజాబ్ ప్రభుత్వం చెబుతుంది.

పంజాబ్ సింగర్ సిద్దూ మూసె వాలాపై గుర్తు తెలియని వ్యక్తులు సిద్దూపై కాల్పులు జరిపారు. మన్సా జిల్లాలో గల జవహర్కె గ్రామంలో ఆదివారం సిద్దూపై ఫైర్ జరిగింది. మన్సా నుంచి సిద్దూ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. అయితే ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లాపై 63 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తీవ్రంగా గాయపడిన అతనిని హుటాహుటీన మాన్సా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు గాయపడగా, వారికి ప్రాథమిక చికిత్స అనంతరం, మరో ఆస్పత్రికి తరలించారు.

English summary
Security cover for over 420 VVIPs will be restored from June 7, the Punjab government said today.ఇ
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X