మోదీ పుతిన్ సెల్ఫీ దెబ్బ.. ట్రంప్ కు నోబెల్ బహుమతి కష్టమే!
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత దేశంలో పర్యటించటం, అమెరికాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పుతిన్ స్నేహ బంధం మరింత బలపడిందని ఈ పర్యటన తర్వాత విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ పుతిన్ లు కార్ లో ప్రయాణం చేస్తూ దిగిన సెల్ఫి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
మోదీ పుతిన్ ఫోటోతో తీవ్ర ఆందోళన .. యూఎస్ లో ట్రంప్ టార్గెట్
ఈ ఫోటోతో ట్రంప్ తీరును యూఎస్ లోని అమెరికా ప్రతినిధుల సభ సభ్యులు ట్రంప్ ను టార్గెట్ చేశారు. ఈ సభ్యులందరూ తమ ఆందోళనలను హౌస్ ఫారిన్ అఫైర్స్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా సబ్‌కమిటీ ముందు తెలియజేశారు.యూఎస్ ప్రతినిధులసభ సభ్యురాలు సిడ్నీ కమ్లాగర్ దువ్ దీనిపై ట్రంప్ ను ప్రశ్నించారు. ట్రంప్ వైఖరి కారణంగా భారతదేశంతో యూఎస్ కు ఉన్న సత్సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.

ట్రంప్ మీకు నోబెల్ బహుమతి రాదు
ఇది అమెరికాకు చాలా హాని చేస్తుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ తీరును టార్గెట్ చేసిన ఆమె ''అమెరికా వ్యూహాత్మక భాగస్వాములను శత్రువుల చేతిలోకి నెట్టడం ద్వారా మీకు నోబెల్ రాదు'' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, పుతిన్ ల సెల్ఫి పై వాషింగ్టన్ తక్షణమే మేల్కోవాలని ఆమె ప్రస్తావించారు.
ట్రంప్ తీరుతో యూఎస్ కే నష్టం
అమెరికా వైఖరి భారత్ ను రష్యా వైపు వెళ్ళేలా చేస్తుందని సిడ్నీ కమ్లాగర్ దువ్ స్పష్టం చేశారు. మరో చట్టసభ సభ్యురాలు ప్రమీలా జయపాల్ కూడా ట్రంప్ విధానాలపై విరుచుకుపడ్డారు. ఆయన నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ కు నష్టం చెయ్యాలనే ట్రంప్ ఆలోచన యూఎస్ వ్యాపారాలకు నష్టం చేస్తుందని అన్నారు. భారత్ పై ట్రంప్ టారిఫ్ లు, తీసుకుంటున్న నిర్ణయాలతో భారతప్రజలు సవాళ్ళని ఎదుర్కొంటున్నారు అన్నారు.
పాకిస్తాన్ తో ట్రంప్ సంబందాలపైన అసహనం
ఇక భారత్ తో కాకుండా పాకిస్తాన్ తో ట్రంప్ సంబంధాలపై అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (అమెరికా) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధ్రువ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్ సైనిక నాయకత్వంపై ట్రంప్ పాలన చూపిస్తున్న అభిమానాన్ని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం అయిన పాకిస్తాన్ తో ట్రంప్ సంబంధాలు దేనికి సంకేతమో చెప్పాలని నిలదీశారు.
-
ట్రంప్ దెబ్బకు తలవంచిన ఇరాన్..? ఎట్టకేలకు కాళ్లబేరానికి..? -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
హార్ముజ్ సంగతి తర్వాత-యుద్దం ముగించేద్దాం..! ట్రంప్ మరో షాక్ ..! -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications