ఆరెస్సెస్-ఈసీ సర్కార్ ను గద్దె దింపుతాం..! ఓట్ చోర్ సభలో రాహుల్ ఫైర్..!
హర్యానా, కర్నాటక సహా పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్ల చోరీపై ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన సభలో మాట్లాడారు. తమ పార్టీ సత్యానికి మద్దతు ఇస్తుందని, నరేంద్రమోడీ-ఆరెస్సెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. రాంలీలా మైదానంలో జరిగిన పార్టీ 'ఓట్ చోర్ గడ్డి చోడ్' ర్యాలీలో ప్రసంగిస్తూ.. ఎన్నికల కమిషన్‌పైనా తీవ్ర విమర్శలు చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పేర్లను ప్రస్తావించిన రాహుల్ గాంధీ.. వారు బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.మోడీ సర్కార్ కు అధికారం ఉందని, కాబట్టి ఓట్ల చోరీలో మునిగిపోయారని రాహుల్ విమర్శించారు. బీహార్ ఎన్నికల సమయంలో బీజేపీ రూ.10,000 పంచిందని, కానీ ఈసీ వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. సత్యం, అసత్యం మధ్య జరిగే ఈ పోరాటంలో, ఎన్నికల కమిషన్ బిజెపి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందన్నారు.

ప్రధాని మోడీ ఎన్నికల సంఘాన్ని కాపాడేందుకు కొత్త చట్టం కూడా తీసుకువచ్చారని రాహుల్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని మారుస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఇదే సభలో పాల్గొన్న ఆయన సోదరి ప్రియాంక గాంధీ సైతం ఈసీ ఓట్ల చోరీకి ఎలా అనుమతిస్తోందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదో ఒక రోజు ఎన్నికల కమిషనర్లు చేస్తున్న అరాచకాలపై బీజేపీ సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. చేతనైతే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు ఎదుర్కోవాలన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications