వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైళ్లలో జనరల్ బోగీలు అందుబాటులోకి.. ప్యాసెంజర్స్ ఇక ప్రయాణం.. కరోనా తర్వాత...

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ప్రభావం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అలాగే కేంద్రం కూడా ఆంక్షలను సడలిస్తోంది. స్కూల్స్, కాలేజీలు ఆఫ్ లైన్ మోడ్‌లోకి వచ్చేశాయి. అయితే రైల్వే సేవలను మరింత విస్తరించనుంది. అంటే ఇప్పటికే రైలు సర్వీస్ అందజేయనుండగా.. జనరల్ బోగీలు కూడా అందుబాటులోకి వస్తాయి. కరోనా వైరస్ వల్ల జనరల్ బెర్తులను క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే.

 Railways resumes general class passenger services

కరోనా కేసులు ఉన్నందున స్లీపర్ క్లాస్ వరకు బెర్తులు ఉండేవి. అదీ కూడా అన్నీ జాగ్రత్తలు తీసుకొని నడిపేవారు. చాలా మంది స్లీపర్ క్లాస్ వాడేవారు. మరీ పేదలు జనరల్ బెర్తులు తీసుకునే వారు. కానీ మొన్నటి వరకు ఆ సదుపాయం లేదు. కేసులు తగ్గడంతో రైలు ఎప్పటిలాగే నడుస్తున్నాయి. కరోనా కన్నా ముందు లాగే పరిస్థితి ఉంది.

సెకండ్ క్లాస్, హాలీడే సందర్భంగా నడిచే స్పెషల్ ట్రైన్స్ కూడా సేవలు అందిస్తున్నాయి. కరోనా సమయంలో ప్రతీ రైలులో నాలుగు జనరల్ బోగీలు కూడా ఉండేవి. ఇప్పుడు అవీ పెరగనున్నాయి. అలాగే జనరల్ బోగీలలో ప్రయాణికులకు అనుమతి ఇస్తారు. ఇందులో చాలా మట్టుకు పేదలు ఉంటారు. ఇవీ దాదాపుగా రద్దీగా ఉంటాయి.

ఇటు నాలుగో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్‌ల బట్టి ఉంటుందని కాన్పూర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్‌వేవ్‌ తీవ్రత ఆధారపడి ఉంటుందని వివరించారు. నాలుగో వేవ్ ఆగస్టు 15 నుంచి 31 మధ్య కాలంలో గరిష్టానికి చేరుకుంటుందని పరిశోధకులు అంచనా వేశారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయన్నారు. దేశంలో కోవిడ్ వేవ్‌లకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేయడం ఇది మూడోసారి. కరోనా థర్డ్‌వేవ్ విషయంలో కొద్ది రోజుల తేడాతో కచ్చితమైన అంచనా వేసింది.

English summary
railways had been running fully reserved ‘special trains’ during the pandemic to prevent crowding in trains so as to contain the spread of the disease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X