న్యూ ఇయర్ వేళ భారీ ఉగ్ర కుట్న భగ్నం..! దిల్లీ తరహా పేలుళ్లకు స్కెచ్..?
దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ముస్తాబవుతున్న వేళ రాజస్థాన్ లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. రాజాస్థాన్ లో ఓ కారులో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్, పేలుడు కాట్రిజ్ లు, ఫ్యూజ్ వైర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ దిల్లీ తరహా పేలుళ్లకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ లోని టోంక్ ప్రాంతంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న భారీ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు జరిపిన తనిఖీల్లో భాగంగా ఓ మారుతీ కారులో దాదాపు 150 కిలోల అమ్మోనియం నైట్రేట్, 2000 పేలుడు కాట్రిజ్ లు, 1,100 మీటర్ల సేఫ్టీ ఫ్యూజ్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు.
రాజస్థాన్ లోని బూంది ప్రాంతం నుంచి టోంక్ ప్రాంతానికి పేలుడు పదార్థాలు సరఫరా అవుతున్నాయని పోలీసులకు సమాచారం అందించిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న కారులో సోదాలు జరిపిన నేపథ్యంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న సురేంద్ర మోచి, సురేంద్ర పట్వా అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

ఇక గత నెలలో దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ బృందం కీలక విషయాలను తేల్చింది. ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీ ఐ20 కారులో ఆత్మాహుతి చేసుకొని ఈ దారుణానికి పాల్పడినట్టు పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసులో అల్- ఫలాహ్ వర్సిటీకి చెందిన చాలా మంది డాక్టర్లకు సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications